ఆటగాడిగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించడమన్నది ఓ సమున్నత గౌరవం. అలాంటి అత్యున్నత అవకాశాన్ని ఏ ఆటగాడు కూడా వదులుకోడు. అయితే కొందరు ప్లేయర్స్ మాత్రం డబ్బుకు కక్కుర్తికి పడి మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడుతుంటారు.
క్రీడా ప్రపంచంలో ప్రతీ క్రీడాకారుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఆ క్రీడా స్పూర్తి, నిజాయితి గనక ఆ ఆటగాడిలో లోపిస్తే.. ఆ ప్లేయర్ కెరీర్ వివాదంలో చిక్కుకున్నట్లే లెక్క. అలా ఎంతో మంది ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని నిషేధం ఎదుర్కొన్న ప్లేయర్స్ క్రీడాలోకంలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికే మనం క్రికెట్ లో ఫిక్సింగ్స్ ఎదుర్కొని నిషేధం విధించబడ్డ చాలా మంది ఆటగాళ్లను చూశాం. తాజాగా ఓ మాజీ ఆటగాడు ఏకంగా 135 మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు రుజువు కావడంతో అతడిపై జీవిత కాల నిషేధం విధించారు.
ఆటగాడిగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించడమన్నది ఓ గౌరవం. అలాంటి అత్యున్నత అవకాశాన్ని ఏ ఆటగాడు కూడా వదులుకోడు. అయితే కొందరు ప్లేయర్స్ మాత్రం డబ్బుకు కక్కుర్తికి పడి దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. తాజాగా మెురాకోకు చెందిన మాజీ టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ (ITIA) షాక్ ఇచ్చింది. మెురాకో టెన్నిస్ ఆటగాడు అయిన యూనెస్ రచిడి 135 మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు రుజువు కావడంతో అతడిపై జీవితకాల నిషేధం విధించింది టెన్నిస్ సంస్థ. అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దాంతో అతడిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. మరి 135 మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ పాల్పడ్డ ఈ టెన్నిస్ ఆటగాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Agência Internacional de Integridade no Tênis baniu o tenista marroquino Younes Rachidi. Ele foi considerado culpado em 135 (!!!) situações envolvendo manipulação de resultado.
Não é erro de digitação: foram CENTO E TRINTA E CINCO mesmo. pic.twitter.com/pK1P51jBi7
— Alexandre Cossenza (@saqueevoleio) February 9, 2023