ఈ వీకెండ్ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారా? ఏం పర్లేదు రేపు ఒక్కరోజే ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి వీటిలో మీ ఛాయిస్ ఏది?
ఐపీఎల్ అంటే ఏడాదికొకసారి వస్తుంది. కానీ ఓటీటీల్లో సినిమాలు మాత్రం ప్రతివారం రిలీజ్ అవుతూనే ఉంటాయి. తక్కువలో తక్కువ ప్రతిసారి 20 కంటే ఎక్కువనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం కూడా దాదాపు అలానే మూవీ ఫెస్టివల్ జరగబోతుందని చెప్పాలి. ఎందుకంటే రేపు ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. వాటిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు ఇతర భాషల చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి తెలియాలంటే ఈ స్టోరీని చివరివరకు చదివేయాల్సిందే!
అసలు విషయానికొస్తే.. ఓటీటీల క్రేజ్ గతంతో పోలిస్తే కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ ప్రతివారం రిలీజయ్యే మూవీస్ సంఖ్య మాత్రం అస్సలు తగ్గడం లేదు. చెప్పాలంటే ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈసారి కూడా అలానే వీకెండ్ కోసం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ జాబితాలో కిరణ్ అబ్బవరం ‘మీటర్’, ‘మ్యాచ్ ఫిక్సింగ్’ లాంటి తెలుగు చిత్రాలు ఉన్నాయి. ‘గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3’ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ఉంది. వీటితోపాటు పలు డబ్బింగ్ సినిమాలు, హిందీ-ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. అవేంటో చూసేయండి మరి!