న్యూజిలాండ్, టీమిండియాను వరుసగా టెస్టుల్లో ఓడించగానే.. అదేదో ప్రపంచాన్ని జయించినట్లు బజ్‌బాల్ స్ట్రాటజీ, ఎటాకింగ్ ప్లే, ఫియర్‌లెస్ క్రికెట్ అంటూ ఇంగ్లండ్ క్రికెటర్లు డాంభీకాలు పలికారు. టెస్టు క్రికెట్ రూపురేఖలనే మార్చేస్తామని, కొత్త పంథా సృష్టిస్తామని పెద్దపెద్ద కామెంట్లు చేశారు. బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచింగ్‌లో బజ్‌బాల్ స్ట్రాటజీ అంటూ కొత్తపదంతో రెచ్చిపోయారు. తీరా రెండు నెలలు తిరక్కముందే ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీని సౌతాఫ్రికా బద్దలుకొట్టింది. సౌతాఫ్రికా తమ భీకరమైన పేస్ అటాక్ ముందు బజ్‌బాల్ స్ట్రాటజీ తొకముడిచింది. ఇంగ్లండ్‌ను తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ తేడా ఓడించింది. పైగా సౌతాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ ఇంగ్లండ్ బజ్‌బాల్ అంతుచూస్తామని చెప్పి మరీ ఓడించడం విశేషం.
లండన్‌లోని క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్‌లో సౌతాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 17న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 165పరుగులకే ఆలౌటైంది. 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా.. నోర్జే 3, మార్కో 2 వికెట్లతో అదరగొట్టారు. ప్రొటీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆ జట్టులో ఓలీ పోప్ (73) మినహా మిగతావాళ్లెవరూ రాణించలేదు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. కెప్టెన్ డీన్ ఎల్గర్ (47), సరెల్ ఎర్వీ (73) 85 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మార్కో జాన్సేన్ (48), మహరాజ్ (41), నార్జ్ (28) కూడా విలువైన పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 326పరుగుల స్కోరు చేసి 161 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, స్టోక్స్ తలా 3వికెట్లు తీసి సత్తాచాటారు.
రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో అలెక్స్ లీస్ (35), స్టువర్ట్ బ్రాడ్ (35) మినహా మిగతావాళ్లు దారుణంగా విఫలం అయ్యారు. దీంతో 149 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్ 12పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో నిప్పులు చెరిగిన రబడ.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను చావు దెబ్బకొట్టాడు. అతనికి తోడు అన్రిచ్ నోర్ట్జే కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 6 వికెట్లతో రాణించాడు. జానీ బెయిర్‌స్టోను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నోర్టే‍్జ అవుట్ చేయడం విశేషం. వీరిద్దరికి మార్కో జాన్సెన్, లుంగి మంచి మద్దతు అందించారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా తగ్గేదేలే అన్నట్లు రాణించాడు.
కాగా.. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్‌కు ఇదే తొలి ఓటమి. ఆ జట్టు వరుసగా 4 టెస్ట్‌లు గెలిచి సత్తా చాటింది. కానీ సౌతాఫ్రికా వారి విజయాలకు గట్టి బ్రేక్ చేసింది. అలాగే డీన్ ఎల్గర్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా 2022లో ఇప్పటివరకు ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. స్వదేశంలో భారత్‌ను 2-1తో ఓడించిన సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌లో 1-1తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించింది. తాజాగా ఇంగ్లండ్‌ను ఇంగ్లండ్‌లో తొలి టెస్టులో మట్టికరిపించింది. దీంతో ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీ, ఫియర్‌లెస్ క్రికెట్ కామెంట్లపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘Bazball’పై ఆస్ట్రేలియా క్రికెటర్లు చేసిన కామెంట్లు విన్నా: బ్రెండన్ మెక్‌కల్లమ్
“Bazball has done wonders in the fourth inns”
SA: There will be no fourth inns. #ENGvSA
— Wasim Jaffer (@WasimJaffer14) August 19, 2022
South Africa beats England#ENGvSA pic.twitter.com/mRzLvLLXaV
— RVCJ Media (@RVCJ_FB) August 19, 2022
England fall to their first defeat of the Stokes-McCullum era – South Africa seal an emphatic win inside three days at Lord’s! https://t.co/WBuIPSb87b | #ENGvSA pic.twitter.com/4JIbZlBVXt
— ESPNcricinfo (@ESPNcricinfo) August 19, 2022