ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. ధోనిని చెన్నై అభిమానులు తలైవా అని చాలా ఓన్ చేసుకున్నారు. ధోనికి చెన్నైకి విడదీయలేని బంధం ఏర్పడింది. ధోని ఐపీఎల్ ఆడినంత కాలం కూడా సీఎస్‌కే టీమ్‌లోనే ఉంటాడని అందరూ భావించారు. సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఎమ్‌ఎస్ ధోనిని రిటేన్ చేసుకుంటామని ప్రకటించింది కూడా. కానీ, ధోని మాత్రం వచ్చే సీజన్‌లో ఆడతాను కానీ అది ఎల్లో జర్సీలోనే అనుకునే అవకాశం లేదని, వచ్చే సీజన్‌కు రిటైన్ చేసుకునే రూల్స్‌ను బట్టి ఏమైనా జరగొచ్చని అన్నాడు.
వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రెండు కొత్త టీమ్‌లు రానున్న నేపథ్యంలో రిటైన్ రూల్స్‌పై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నేలకొందని పేర్కొన్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు షాక్ తిన్నారు. ఇంతకీ ధోని వచ్చే సీజన్‌లో చెన్నై తరఫున ఆడతాడ లేక కొత్త టీమ్‌కు కెప్టెన్‌గా వెళ్తాడా అని తెగ మదనపడుతున్నారు. ధోనిపై అభిమానంతో చాలా మంది సీఎస్‌కే టీమ్‌కు సపోర్ట్ చేస్తుంటారు. మరీ ధోని లేకుండా చెన్నై టీమ్ అంత మద్దతు లభిస్తుందో లేదో చూడాలి. ధోని సీఎస్‌కే టీమ్‌లో కొనసాగడం మంచిదా? కొత్త టీమ్‌కు మారడం మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK గెలవాలని ధోని కూతురు చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా