CSK గెలవాలని ధోని కూతురు చేసిన పనికి ఫ్యాన్స్‌ ఫిదా

dhoni csk

సీఎస్‌కే కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ అంతాఇంతా కాదు. దానికి కారణం కెప్టెన్‌ కూల్‌, తలైవా మహేంద్రసింగ్‌ ధోని. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు గెలవాలని కోట్ల మంది అభిమానులు కోరుకుంటారు. కానీ ధోని కూతురు జివా ధోని మాత్రం ఏకంగా చేతులు జోడించి దేవుడ్ని ప్రార్థించింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని కూతురు రెండు చేతులు జోడించి ఎంతో అభిమానంతో సీఎస్‌కే గెలవాలని కోరుకుంది.

ఆ ఫోటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తమ అభిమాన క్రికెటర్‌ ధోని కూతురు, తమ అభిమాన ఐపీఎల్‌ టీమ్‌ కోసం ఇలా చేయడంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేవు. ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. కాగా ఆ మ్యాచ్‌లో మాత్రం సీఎస్‌కే గెలవలేదు. ఈ మ్యాచ్‌ పోయినా.. జివా ధోని ప్రార్థనలతో నాలుగో ఐపీఎల్‌ ట్రోఫీని సీఎస్‌కే కచ్చితంగా గెలిచితీరుతుందని సీఎస్‌కే, ధోని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.