చాహల్ భార్య 'ధనశ్రీ వర్మ' మరో బాంబ్ పేల్చింది. ఎప్పటికప్పుడు శ్రేయాస్ అయ్యర్‌తో కనిపిస్తున్న ఈ అమ్మడు.. నా మనసులో ఉంది వీళ్లెవరు కాదు.. 'రోహిత్' అంటూ ఎవ్వరూ ఊహించని సమాధానమిచ్చింది. అలా ధనశ్రీ ఎందుకు చెప్పిందో తెలియాలంటే కింద చదివేద్దాం..
చాహల్ భార్య కంటే ‘ధనశ్రీ వర్మ‘గానే ఈ అమ్మడు బాగా పాపులర్ అవుతోంది. అందుకు కారణం.. ధనశ్రీ, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఫోటోలలో కనిపించడమే. చాహల్ ఐపీఎల్ పనుల్లో బిజీగా ఉంటే ధనశ్రీ మాత్రం.. శ్రేయాస్ అయ్యర్ తో బిజీగా ఉందంటూ పలువురు కథనాలు ప్రచురిస్తున్నారు. అందుకు వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను జత చేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉన్నా, లేకపోయినా.. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరమైన అయ్యర్, ధనశ్రీతో కలిసి పార్టీలకు.. పబ్‌లకు వెళ్తున్నాడన్నది నిజం. ధనశ్రీ షేర్ చేసే ఫోటోలలో చహల్ లేకపోయినా పెద్దగా పట్టించుకోని నెటిజన్లు అయ్యర్ లేకుంటే మాత్రం.. ‘శ్రేయాస్ అయ్యర్ ఎక్కడ..?’ అని బాహాటంగానే అడిగేస్తున్నారు.
బయట ఇంత జరుగుతుంటే ధనశ్రీ మాత్రం.. ‘నా మనుసులో ఉన్న క్రికెటర్ అయ్యర్ కాదు.. ‘రోహిత్ శర్మ’ అంటూ మరో బాంబ్ పేల్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనశ్రీని హోస్ట్.. ‘చాహల్ కాకుండా ఒక క్రికెటర్ గురుంచి మనసులో అనుకోమన్నది. అందుకు సరే అన్న ధనశ్రీ.. ‘రోహిత్.. రోహిత్ అంటూ కలవరించడం మొదలుపెట్టింది’. అలా ధనశ్రీ మనసులో అనుకున్న సమాధానాన్ని హోస్ట్ బయటపెట్టేయడంతో.. నిజమే మీరు గ్రేట్ అంటూ ఆమె సదరు హోస్ట్‌పై పొగడ్తలు కురిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో.. ఈ మాటలు అయ్యర్ వింటే ఎంత బాధపడతాడో..’ అనేవారు కొందరైతే, ‘మీ మనసులో చాహల్ కే చాలామందికి చోటుంది..’ అనేవారు మరికొందరు.
— Sports Dynamic (@altamashi25) April 8, 2023
డాక్టర్, కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అయిన ధనశ్రీని చాహల్ ప్రేమించి పెళ్లాడాడు. మొదట్లో వీరిద్దరూ కలిసి రీల్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు మంచి వినోదాన్ని పంచేవారు. కాలక్రమేణ వీరిద్దరి వీడియోలు కాదు కదా! ఇద్దరూ కలిసి కనిపించడమే అరుదైపోయింది. ఇంకా చెప్పాలంటే.. ధనశ్రీ- అయ్యర్ తో కనిపిస్తున్న సందర్భాలే ఎక్కువవుతున్నాయి. మొన్న ఆ మధ్య శార్దూల్ ఠాకూర్ పెళ్లిలో జంటగా మెరిసిన ఈ జంట.. నిన్న ఇప్తార్ విందులో మరోసారి మెరిశారు. దీంతో చాహల్ జీవితంలో అయ్యర్ చిచ్చు పెడుతున్నాడంటూ అభిమానులు నెట్టింట కోడై కూస్తున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Apart from Cricketers, Even their wives also admire God Rohit Sharma a lot. Shows how much influence he had on everyone.
My Goat @ImRo45 ❤
pic.twitter.com/dsYD7x4aRP— Immy|| 🇮🇳 (@TotallyImro45) April 14, 2023