“నచ్చిన నెచ్చెలికి మనసులోని ప్రేమను తెలియజేసి.. ఆమె వేలికి ఉంగరం తొడగటం.. ఆ వెంటనే ఆమె కూడా చిరునవ్వులతో ‘ఇష్టమే’ అని సమ్మతం తెలపడం.. ‘ఇకపై నీతోనే నా జీవన పయనం’ అంటూ ఆత్మీయ ఆలింగనంలో అతడిని బంధీ చేయడం.. అక్కడిక్కడే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోవడం”.. ఈ కవిత్వం చదువుతుంటే మీకేమైనా గుర్తొస్తుందా! అదేనండి మన రాజు గారు.. దీపక్ చాహర్.. గతేడాది ఐపీఎల్ సందర్బంగా తన ప్రేయసికి ప్రేమ ఆహ్వానాన్ని పంపిన విషయం అందరకి గుర్తుండే ఉంటుంది. త్వరలో.. ఈ టీమిండియా పేసర్ మనసిచ్చిన అమ్మాయిని మనువాడబోతున్నాడు.
దీపక్ చాహర్ తన చిరాకాల ప్రేయసి జయ భరద్వాజ్‌ను చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 1న వీరిద్దరి వివాహం జరగనుంది. యాక్టర్, మోడల్ సిద్ధార్థ్ భరద్వాజ్ సోదరే జయ భరద్వాజ్. బిగ్ బాస్ హిందీ సీజన్ 5 ద్వారా సిద్ధార్థ్‌కు మంచి గుర్తింపు లభించింది. ఢిల్లీకి చెందిన జయ భరద్వాజ్ ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. కాగా వీరిద్దరి వివాహనికి సంబంధించిన ఆహ్వన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్‌ను సీఎస్కే రూ.14 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి చాహర్ దూరమయ్యాడు. త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు చాహర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Mystery Girls IPL 2022: ఆహా ఏమి అందం.. IPL 2022లో తళుక్కుమంటున్న మిస్టరీ గర్ల్స్!