నటీనటులకు అభిమానులు ఉండటం కామన్. అసలు అభిమానులు అనేవారు లేకపోతే.. సినీ పరిశ్రమలోని హీరో హీరోయిన్లకు మనుగడ సాగడం కష్టమే. అయితే టాప్ హీరోలకు ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటుంది. తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తుంటారు అభిమానులు.
నటీనటులకు అభిమానులు ఉండటం కామన్. అసలు అభిమానులు అనేవారు లేకపోతే.. సినీ పరిశ్రమలోని హీరో హీరోయిన్లకు, నటీనటులకు మనుగడ సాగడం కష్టమే. అయితే టాప్ హీరోలకు ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటుంది. హీరోల సినిమాల ప్రకటన నుండి మూవీ విడుదలయ్యే వరకు వీరి హంగామా అంతా ఇంతా కాదు. బొమ్మ థియేటర్లతో పడే రోజైతే.. వీరిని పట్టుకోవడం అసాధ్యం. ఇక తమ అభిమాన తారల పుట్టిన రోజు వస్తే.. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి రక్త దానం, అన్నదానం, గుడిలో పూజలు, కేకు కటింగ్స్ వంటివి చేస్తారు. తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తుంటారు. అయితే ఫ్యాన్సులో బాలయ్య అభిమానులే వేరయ్యా అనే చందంగా ఉంటారు.
నందమూరి ఎన్టీఆర్‌తో మొదలైన నట వారసత్వం వారి మనవడు వరకు పాకింది. దేశంలో గొప్ప నటుల్లో ఒకరిగా సీనియర్ ఎన్టీఆర్ మారగా.. ఆ ప్రభను ఖండాంతరాలకు తీసుకెళ్లారు ఆయన వారసుడు జూ ఎన్టీఆర్. బాలకృష్ణ, హరికృష్ణ, తారకరత్న, కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ ఈ కుటుంబం నుండి వచ్చిన వారే. ఈ వర్గం, ఆ వర్గం అని తేడా లేకుండా ఎన్టీఆర్‌ను అభిమానిస్తారు ప్రజలు. తమ దేవుడిగా ఆరాధిస్తారు. ఆయన రూపంలో ఉన్న జూ ఎన్టీఆర్ అన్నా అంతే ఇష్టపడుతుంటారు. ఈ ఫ్యామిలీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీరిలో కొంత మంది తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుతుంటారు. తమ అభిమానాన్ని శుభ కార్యాలయాల్లోనూ కనబరుస్తున్నారు. 2019లో కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు అనే అభిమాని.. బాలకృష్ణపై తనకు గల అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. తన కుమారుడి పెళ్లి శుభలేఖపై దేవుళ్ల ఫోటోతో పాటు బాలకృష్ణ ఫోటోను ముద్రించి.. ఆయనంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశారు.
మొన్నటికి మొన్న ఓ విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలో నందమూరి తారకరామారావు ఫోటోలను, బాలకృష్ణ ఫోటోలను ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానించాడు. అంతే కాదూ.. బాలయ్య బాబుకు పెళ్లికి రాలేదని పెళ్లి వాయిదా కూడా వేసుకోగా.. బాలకృష్ణ అల్లుడు భరత్.. హాజరై.. సర్థి చెప్పాడు. ఇప్పుడు మరొకరు ఇటువంటి చర్యనే చేపట్టారు. శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి.. తన అభిమాన నటుడు జూ ఎన్టీఆర్ ఫోటోను పెళ్లి పత్రికలో వేయించుకోవడమే కాకుండా.. తారక్ ఫ్యాన్స్ అందరినీ పెళ్లికి ఆహ్వానించారు. తిరుపతి అనే యువకుడు తన పెళ్లి పత్రికపై తారక్ ఫోటో పెట్టుకున్నాడు. ఈ నెల 27న తెల్లవారు జామున మౌనిక అనే యువతితో అతడి పెళ్లి జరగనుంది. ఆ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆయన.. పెళ్లికి కుటుంబ సభ్యులను, ఫ్యామిలీని, బంధువులను, తారక్ ఫ్యాన్స్ ఆహ్వానించి.. ఆశ్వీరదించాలని కోరారు.
To my dear friends, family members, relatives, fans of Tarak, I sincerely wish you all to come and bless us on 27th of this month.♥️ pic.twitter.com/QdJ8FPeFrg
— Tirupati Tarak 🇮🇳 (@tirupatitarak31) June 24, 2023