భారత యువ క్రికెటర్, స్పిన్నర్ రాహుల్ చాహర్ ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇషానీ జోహార్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వృత్తి రీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్, రాహుల్ చాహార్ ల ఎంగేజ్‌మెంట్ 2019 లో జరిగింది. మూడేళ్ల తర్వాత వీరి వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకలో సోదరుడు దీపక్ చాహార్, సోదరి మాలతి చాహార్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక సోదరుడి ప్రియురాలు(జయ భరద్వాజ్) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవడం విశేషం. జయ భరద్వాజ్.. చూడడానికి ఫారినర్‌లా కనిపిస్తున్నా.. భారతీయురాలే. బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోగ్రామ్‌లో పాల్గొని, ఫైనల్ చేరిన వీడియో జాకీ, మోడల్, నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ చెల్లెలే జయ భరద్వాజ్.
ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్కే, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై ఫ్యామీలీ గ్యాలరీకి వచ్చిన దీపక్ చాహర్.. ఏం తెలియనట్టూ కొద్దిసేపు నిలబడ్డాడు. తర్వాత ధోనీ కూతురు జీవాను పక్కకు జరుపుతూ తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. అది కూడా సినిమా స్టైల్లో మొకాలిపై కూర్చొని ‘నేను నిన్న ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. దీపక్ చాహర్ చేసిన పనితో మొదట షాక్ కు గురైన ఆ అమ్మాయి. వాట్? అంటూనే ప్రేమను అంగీకరిస్తూ గట్టిగా హత్తుకుంది. తరువాత అతని చేత తన వేలికి ఉంగరాన్ని పెట్టించుకుంది. చాహర్‌కు కూడా రింగ్ పెట్టింది. ఇదంతా ఓ సినిమా సన్నివేశాన్ని తలపించింది.
ఇది కూడా చదవండి: IPLలో ఒక్క ఓవర్ వేస్తే రూ.20.5 లక్షలు తీసుకుంటున్న బౌలర్దీపక్ చాహర్ చేసిన పనికి అక్కడున్న వారు మొదట అవాక్కైనా.. హోహో అంటూ చప్పట్లతో అభినందించారు. ఇక కామెంటేటర్లు సైతం ఈ జోడి బాగుండాలని దీవించారు. దీపక్ చాహర్‌కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం వీరి జోడి రాహుల్ చాహర్ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తమ్ముడి పెళ్ళికి ప్రియురాలితో కలిసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా అన్న.. పెళ్లెప్పుడు చేసుకుంటాడో చూడాలి మరి.
Chennai Super Kings Player, Deepak Chahar proposes girlfriend, Jaya Bharadwaj in the stands after his against Punjab Kings today!❤️❤️
.
.#DeepakChahar #CSK #IPL2021 pic.twitter.com/oVQxmsrgRH— All That Trending (@allthatrending) October 8, 2021