భారత్-ఆసీస్ మధ్య జరిగే తొలి వన్డే కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. తొలి వన్డే కు కాస్త టైమ్ ఉండటంతో ఆసీస్ ఆటగాళ్లు ముంబైలో తిరుగుతూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ ముంబై వీధుల్లో బాయ్స్ తో గల్లీ క్రికెట్ ఆడి సర్ఫ్రైజ్ చేశాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ముగియడంతో ఇప్పుడు ఇరు జట్లు వన్డే క్రికెట్ మీద దృష్టి సారించాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17, 19, 22 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మూడు వన్డేలకు వరుసగా ముంబై , వైజాగ్, చెన్నై ఆతిధ్యం ఇవ్వబోతున్నాయి. ప్రస్తుతం తొలి వన్డే కోసం ముంబై చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ముంబై వీధుల్లో సందడి చేస్తూ కనిపించాడు.
ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగాంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాయం నుంచి కోలుకొని.. భారత్ తో జరగబోయే వన్డే సిరీస్ కి సన్నద్ధమవుతున్నాడు. తొలి వన్డేకి ఇంకా రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వార్నర్ చిల్ అయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో వార్నర్ క్రికెట్ అభిమానులని ఖుషీ చేస్తూ కనిపించాడు. ముంబై వీధుల్లో సరదాగా గల్లీ క్రికెట్ ఆడుతూ అభిమానుల మనసు దోచుకున్నాడు. వార్నర్ ఇలా గల్లీ క్రికెట్ ఆడడం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే.. వార్నర్ ఇలా చేయడం కొత్తేమి కాదు. ఇదివరకు సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న టైంలో వార్నర్.. తన భార్యతో కలిసి కొన్ని తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ అప్పట్లో బాగా వైరల్ అయ్యాడు.
ప్రస్తుతం వార్నర్ ఏమంత గొప్ప ఫామ్ లో లేడు. ఫార్మాట్ ఏదైనా వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారుతున్నాడు. భారత్ తో మూడు వన్డేలు ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆడనున్నాడు ఈ డాషింగ్ ఓపెనర్. ఇండియన్ స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వార్నర్ కెప్టెన్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. మరి వార్నర్ ముంబై వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
David Warner playing cricket with kids in Mumbai.
What a lovely character David Warner is! ❤️ pic.twitter.com/Z4OPYt5Oaa
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2023