ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రొనాల్డొ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో సాధించిన 2 గోల్స్‌తో రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు 109 గోల్స్‌తో తొలిస్థానంలో ఉన్న ఇరాన్‌కు చెందిన ప్లేయర్ అలీ డేయీ రికార్డును రొనాల్డో బద్దలు కొట్టాడు.
అఫీషియల్ లెక్కల ప్రకారం క్రిస్టియానో రొనాల్డో మొత్తం 180 మ్యాచుల్లో 111 గోల్స్ సాధించాడు. ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో క్రిస్టియానో మరో రికార్డు క్రియేట్ చేశాడు. పోర్చుగల్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన సెర్జియో రామెస్ రికార్డును రొనాల్డో సమయం చేశాడు. 149 మ్యాచుల్లోనే 109 గోల్స్ చేసి ఇరాన్ ప్లేయర్ అలీ డేయీ రెండో స్థానంలో, మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్‌లలో 89 గోల్స్‌తో మూడోస్థానంలో ఉన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే ఆఖరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి 2-1 తేడాతో పోర్చుగల్ గెలుపొందడంలో రొనాల్డో కీలకపాత్ర పోషించాడు. రొనాల్డో గ్రౌండ్‌లోనే కాదు, సోషల్ మీడియాలోనూ రికార్డులు సృష్టిస్తూనే ఉంటాడు. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా క్రిస్టియానోకి రికార్డు ఉంది. ఇక ఒక్కో ప్రమోషనల్ పోల్టుకు రొనాల్డో దాదాపు రూ.11 కోట్లకు పైనే తీసుకుంటూ తొలిస్థానంలో ఉన్నాడు రొనాల్డో.
Ronaldo has now scored the most international goals in history pic.twitter.com/sAnkKOB2pX
— RedAlvin (@RedAlvin4) September 1, 2021