టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వేరే ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రీతిలో అతడు సాధించిన ఘనతపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని మించిన క్రికెటర్ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతగా జెంటిల్మన్ గేమ్‌పై తన ముద్ర వేశాడు విరాట్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినా, ఐపీఎల్లో ఆడినా అదే ఆటతీరు. మ్యాచ్‌ను ముగించడంలో అతడు దిట్ట. ఛేదనలో చెలరేగుతాడు కాబట్టే అతడ్ని ఛేజింక్ కింగ్ అని పిలుస్తారు. కోహ్లీ తన ఆటతో భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. విరాట్ ఆటను చూసేందుకు ఆడియెన్స్ స్టేడియాలకు పోటెత్తుతారు. వారిని అతడు ఎప్పుడూ నిరాశపర్చడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్‌ను అందరూ ముద్దుగా రన్ మెషీన్ అని పిలుస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ విరాట్ కోహ్లీ తన సత్తా చాటాడు. తనలో రన్స్ చేయాలనే దాహం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ పదహారో సీజన్లో ఏకంగా రెండు సెంచరీలు బాదాడు కోహ్లీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీలతో సత్తా చాటాడు కోహ్లీ. విరాట్ ఎంత బాగా ఆడినా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి కప్ రేసు నుంచి తప్పుకుంది. కాగా, కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. క్రీడలకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రభావం చూపే స్పోర్ట్స్పర్సన్స్ లిస్టులో టాప్-3లో విరాట్ స్థానం దక్కించుకున్నాడు. హైప్ ఆడిటర్ ప్రకటించిన ఈ జాబితాలో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియాన్ రొనాల్డో టాప్ ప్లేసులో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 584 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన అతడు.. మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి ప్లేసులో మరో ఫుట్‌బాలర్ లియోనెస్ మెస్సీ ఉన్నాడు. అతడి ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 463 మిలియన్లుగా ఉంది. ఈ లిస్టులో ఉన్న నాన్-ఫుట్‌బాలర్ కోహ్లీ ఒక్కడే. అతడికి ఇన్‌స్టాలో 249 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న మరో క్రికెటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (28 మిలియన్ల ఫాలోవర్లు).
Top 3 most influential people in the world on Instagram. [Hype Auditor]
1) Ronaldo
2) Messi
3) Kohli pic.twitter.com/0q6uhcTScp— Johns. (@CricCrazyJohns) May 22, 2023