ఇప్పుడు విజయాన్ని రుచి చూస్తున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒకప్పుడు సాధారణ మనుషులే. సాధారణ మనుషుల్లానే సైకిల్ మీదనో, ఒక డొక్కు టూవీలర్ మీదనో తిరుగుతూ.. రోడ్డు మీద ఒక కారు వెళ్తుంటే.. ఆ కారులో మనం ఎప్పుడు తిరుగుతామో అని అనుకునేవాళ్లే. అలా అనుకున్నవాళ్ళు ఇప్పుడు కారు ఎక్కడమే కాదు, విమానాల్లో సైతం విహరిస్తున్నారు. ప్రతిభ ఉండి, కష్టపడేతత్వం ఉంటే కోరుకున్నవన్నీ మన దగ్గర వాలిపోతాయని అనేక మంది గొప్ప వ్యక్తులు నిరూపించారు. సినిమా రంగమైనా, క్రీడా రంగమైనా, ఏ రంగమైనా గానీ సక్సెస్ వస్తే తినే ఫుడ్డు, పడుకునే బెడ్డు, ఉండే ఇల్లు ఇలా అన్నీ మారతాయి. కొత్త ఇల్లు, కొత్త కారు ఇలా కొత్త వస్తువులతో తమ కోరికలను నెరవేర్చుకుంటారు.
తాజాగా భారతీయ క్రికెటర్ స్మృతి మంధాన తన కలల కారుని సొంతం చేసుకున్నారు. భారతీయ మహిళల క్రికెట్ టీమ్ తరపున జాతీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే స్మృతి మంధాన లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. టాప్ వేరియెంట్ మోడల్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. ఈ మోడల్ బేసిక్ మోడల్ ధర 72 లక్షలు పైనే ఉంది. సిలికాన్ కలర్ షేడ్ ఉన్న కారుని కొనుక్కున్నారు స్మృతి మంధాన. 3డి సౌండ్ కెమెరా, క్యాబిన్ ఎయిర్ అయినైజేషన్ వంటివి ఈ వాహనం యొక్క ప్రత్యేకతలు. యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, సైడ్ ఎయిర్ బ్యాగ్, ఓవర్ హెడ్ ఎయిర్ బ్యాగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ కారు యొక్క ఇంజన్ సామర్థ్యం స్మృతి బ్యాటింగ్ లానే పవర్ ఫుల్ గా ఉంది. 247 బీహెచ్పీ పవర్ ని జనరేట్ చేసే ఇంజన్ సామర్థ్యం మరియు గరిష్ట టార్క్ 365 ఎన్ఎంగా ఉంది.
Smriti Mandhana buys new Range Rover Evoque https://t.co/dsb3YBCDvC
— Indian Women’s Cricket Fans Network (@IWCFG) October 26, 2022
మహిళల క్రికెట్ టీమ్ లో స్మృతి మంధాన ఒక కీలకమైన ప్లేయర్. ఓపెనర్ గా దిగి ఎన్నో మ్యాచుల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ గెలుపులో ఈమె పాత్ర ఎంతో ఉంది. 77 వన్డేలు ఆడి 3073 పరుగులు, 102 టెస్టు మ్యాచులు ఆడి 2437 పరుగులు సాధించారు. 4 టెస్టు మ్యాచుల్లో 305 పరుగులు సాధించిన ఘనత స్మృతి మంధానదే. అలాంటి స్మృతి మంధాన తొలిసారిగా లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె రేంజ్ రోవర్ కారు పక్కన నిలబడి ఉన్న తీయించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే కారు కొన్న శుభ సందర్భంగా అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కూడా కట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.