కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీల్లో స్వర్ణ పతకం కోసం భారత్-ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడ్డాయి. కానీ.. అదృష్టం ఆస్ట్రేలియా వైపే నిలిచింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన టీమిండియా అమ్మాయిలు.. బౌటింగ్‌లో అదే టెంపోను కొనసాగించలేకపోయారు. భారత కెప్టెన్ ఒంటరి పోరాటం చేసినా.. గోల్డ్‌ను అందించలేకపోయింది. దీంతో సిల్వర్ మెడల్‌తో టీమిండియా క్రికెట్ పోటీలను ముగించింది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మెగ్ లానింగ్ 26 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 36 పరుగులు, ఓపెనర్ బెత్ మూనీ 41 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులతో రాణించారు. అలీషా గార్డ్ నర్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25పరుగులు చేసి ఉన్నంత సేపు ధాటిగా ఆడింది. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది.
భారత బౌలర్లలో స్నేహ రానా 2, రేణుకా సింగ్ 2, దీప్తి శర్మ, రాధాయాదవ్ తలా ఓ వికెట్ తీశారు. ఇక గోల్డ్ కోసం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన (6), సఫాలీ వర్మ (11) వెంటవెంటనే అవుటవ్వడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఈ తరుణంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 65 పరుగులు చేసి చివరి వరకు ఒంటరి పోరాటం చేసింది.
జెమీమా రోడ్రీగ్స్(33 బంతుల్లో 3 ఫోర్లతో 33పరుగులు) కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. వీరిద్దరు స్ట్రైక్ రోటేట్ చేసుకుంటూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. మూడో వికెట్‌కు 96పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అయితే ఈ జోడీని స్కట్ విడదీసింది. జెమీమా 118పరుగుల వద్ద బౌల్డ్ అయింది. అప్పటికీ భారత్ 33బంతుల్లో 44పరుగులు చేస్తే చాలు. దీంతో టీమిండియా విజయం ఖాయంగా కనిపించింది. కానీ.. ఇక్కడి నుంచి టీమిండియా రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోతూనే ఉంది.
అంతసేపు గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న కెప్టెన్ హర్మన్ ఓ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరింది. ఇక చివర్లో దీప్తి శర్మ (13) కాస్త టచ్‌లో కన్పించినా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో భారత ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో 11పరుగులు చేయాల్సిన తరుణంలో ఒక రనౌట్, ఒక ఎల్బీడబ్ల్యూతో భారత్ ఆలౌటైంది. దీంతో తొలి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ ఆసీస్ మెడలో చేరింది. భారత్ సిల్వర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Team 🇮🇳India at the podium getting their Silver Medal#INDvsAUS pic.twitter.com/u3ZLAghhpZ
— Female Cricket #B2022 (@imfemalecricket) August 7, 2022
Take a bow, skipper 🔥😍#INDvsAUS pic.twitter.com/UCfoippVIm
— Female Cricket #B2022 (@imfemalecricket) August 7, 2022
Historical Medal Ceremony of Silver Medalist Indian Women’s Cricket Team 🤩 #INDvsAUS #cwgcricket #CWG22 #CWG22india @BCCIWomen @thukraltales @cricketwallah @ramanbhanot @vedakmurthy08 @SonySportsNetwk pic.twitter.com/0B3dSMevj2
— Vishal Bansal (@mevishalbansal) August 7, 2022
ఇది కూడా చదవండి: ‘కొడితే సిక్సర్ లేదంటే బౌండరీ’.. ఇంగ్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించిన స్మృతి మందాన!