విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్న విషయం తెలిసిందే. అయితే.. రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందడం వెనుకున్న రహస్యాన్ని టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వెల్లడించారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ సంచలన విషయాలు వెల్లడించారు.
ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అడ్డంగా దొరికిపోయాడు. ఆఫ్ ది రికార్డు అంటూ.. సంచలన విషయాలు బయటపెట్టాడు. టీమిండియా ఆటగాళ్ల గురించి అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ, రోహిత్-కోహ్లీ వివాదం, గంగూలీ వర్సెస్ కోహ్లీ లాంటి పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత.. అప్పటి వరకు మూడు ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా కొనసాగిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ భారం తగ్గించుకునేందుకు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి బోర్డు-కోహ్లీ మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత అప్పటి బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలోని బోర్డు పెద్దలు కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఆ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ ని కూడా వదిలేశాడు. ఇలా మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ చేసింది బీసీసీఐ.
కాగా.. కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తాము కోరినట్లు, కానీ ఎంత చెప్పినా కోహ్లీ వినలేదని, ఇక తప్పని పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ల(టీ20, వన్డే)కు ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో కోహ్లీని తప్పించి రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ఛైర్మన్ గంగూలీ వెల్లడించారు. కానీ.. కోహ్లీ మాత్రం తనను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని ఎవరూ కోరలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత బీసీసీఐ ఛైర్మన్‌గా దాదా పదవీ కాలం ముగియడం.. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చి అదరగొడుతుంటంతో అంతా సర్దుకుంది. ఇదంతా ఇప్పటివరకు బయటి జనాలుకు తెలిసిన విషయం. కానీ.. అసలు లోపల ఏం జరిగిందో ఇప్పుడు చేతన్ శర్మ వివరించాడు. విరాట్ కోహ్లీ-గంగూలీ మధ్య కోల్డ్ వార్ జరిగినట్లు చేతన్ పేర్కొన్నాడు. గంగూలీకి కోహ్లీ అంటే ఇష్టం ఉండేది కాదని అన్నాడు.
టీ20 కెప్టెన్‌గా కోహ్లీ రాజీనామా చేసిన తర్వాత.. అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించారు. అయితే.. రోహిత్ శర్మను కెప్టెన్ చేయడంపై స్పందిస్తే.. గంగూలీ ప్రత్యేకంగా రోహిత్ శర్మకు ఫేవర్ చేయలేదని కేవలం కోహ్లీపై అయిష్టంతోనే దాదా రోహిత్‌ను కెప్టెన్ చేశాడని, అయినా.. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలనే ఆలోచన కేవలం గంగూలీది మాత్రమే కాదని, బోర్డులోని సభ్యులంతా ఉమ్మడిగా కలిసి తీసుకున్నదే అని చేతన్ శర్మ వెల్లడించాడు. అయితే.. ముఖ్యంగా రోహిత్ శర్మలో ఎలాంటి ప్రత్యేకతను గుర్తించి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించలేదని, కేవలం కోహ్లీ అంటే ఇష్టం లేకనే మరో కెప్టెన్ టీమిండియాకు వచ్చినట్లు చేతన్ పేర్కొనడం గమనార్హం. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయిన తర్వాత.. 2022 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వైఫల్యం తర్వాత రోహిత్‌ను అనధికారికంగా టీ20 కెప్టెన్‌గా తప్పించి, హార్దిక్ పాండ్యాను అన్‌అఫిషీయల్ కెప్టెన్‌గా నియమించారు. మరి రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ అందిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chetan Sharma speaks about dirty cricket politics 😳 #ChetanSharmaStingpic.twitter.com/Z9bQkQdCtb
— Nitesh Yadav (@SFGPrediction) February 15, 2023