సాధారణంగా ఏ ఆటలోనైనా ఆటగాళ్లు సహనం కోల్పోవడం సహజమే. సహనం కోల్పోయే సంఘటనలు ఎక్కువగా మనం సాకర్ ప్రపంచంలో చూస్తాం. ఫుట్ బాల్ లో ఆటగాళ్లు తమ ఓపిక నశించడంతో ఏకంగా కొట్టుకోవడం కూడా మనం అనేక సందర్భాల్లో చూశాం. అయితే క్రికెట్ లో కొట్టుకున్న సందర్భాలు అరుదుగానీ ఆటగాళ్లు ఫేస్ టు ఫేస్ కొపంగా చూసుకోవడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటనే భారత్ – పాక్ మ్యాచ్ లో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటన భారత బౌలర్ అయిన యజ్వేంద్ర చాహల్, పాక్ బ్యాటర్ అయిన ఫఖార్ జమాన్ మధ్య చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ రవి బిష్ణోయ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. తర్వాత బ్యాటింగ్ కు ఫఖార్ జమాన్ వచ్చాడు వీళ్లీద్దరు ఆచి తూచి ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా పరిగెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తన రెండో ఓవర్ వేయడానికి చాహల్ వచ్చాడు. అప్పటికే 17 బంతుల్లో 15 పరుగులతో జమాన్ క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లలో 3వ బంతిని బౌండరీగా మలిచిన జమాన్ తన స్ట్రాటజీని తెలియజేశాడు.
దీన్ని గమనించిన చాహల్ తన 4వ బంతిని చాలా స్లోగా 76 కి.మీ వేగంతో సంధించాడు. ఆ బాల్ ని ముందుకు వచ్చి ఆడిన జమాన్ లాంగ్ ఆన్ లో కోహ్లీ చేతికి చిక్కాడు. కోహ్లీ క్యాచ్ పట్టగానే చాహల్ ఫఖార్ వైపు కోపంగా చూస్తూ.. కొన్ని క్షణాలు ఉన్నాడు. జమాన్ కు ఏమీ అర్ధం కానట్లు ఫేస్ పెట్టాడు. అక్కడికి వెంటనే రోహిత్ వచ్చి చాహల్ ని అభినందించాడు. ఫోర్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించిన జమాన్ ను తన తెలివైన స్లో బాల్ తో బోల్తా కొట్టించాడు చాహల్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి చాహల్-ఫఖార్ మధ్య జరిగిన ఈ సన్నివేషం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 5, 2022