ఆసియా కప్ 2022లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌ను ఓడించి అన్బిటేన్గా సూపర్ ఫోర్కు చేరిన భారత్‌కు పాక్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి చెత్త బౌలింగే కారణమనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఆదివారం పాకిస్థాన్‌తో 20 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు టీమిండియాలో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు కరువయ్యారు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌తో పాటు హార్దిక్ పాండ్యాపై నమ్మకంతో టీమిండియా బరిలోకి దిగింది. కానీ.. వీరిలో రవి బిష్ణోయ్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. మిగతా నలుగురు దారుణంగా విఫలం అయ్యారు. ఆల్‌రౌండర్‌గా ఉన్న పాండ్యాపై టీమిండియా కెప్టెన్, కోచ్ అతిగా నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్న జట్టులో ఒకరిద్దరు అంతా ప్రభావం చూపలేకపోతున్న సమయంలో మాత్రమే ఆల్రౌండర్లను ప్రయోగించాలి. కానీ.. పాండ్యాను స్పెషలిస్ట్ బౌలర్లగా ఆడిస్తున్నారు. కానీ.. సరైన బ్యాటింగ్ లైనప్ ఎదురైతే పాండ్యా తేలిపోయిన మ్యాచ్‌లే ఎక్కువ. అయినా పాకిస్థాన్‌పై ఓటమితో పాండ్యాను తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే భువీ లాంటి సీనియర్ స్పెషలిస్ట్ బౌలర్లే విఫలమైన చోట పాండ్యా రాణించాలనుకోవడం అత్యాశే అవుతుంది. అలాగే డీకే స్థానంలో దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకున్నారు. కానీ.. హుడాతో బౌలింగ్ చేయించలేదు. పైగా అతన్ని ఫినిషర్ రోల్లో ఆడించారు. టాపార్డర్ బ్యాటర్ అయిన హుడా చివరి ఓవర్లలో పరుగులు చేయలేకపోయాడు. నలుగురు బౌలర్లతో పాటు పాండ్యాను నమ్ముకుని బరిలోకి దిగిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. అసలు టీమిండియా పరిస్థితిని పరిశీలస్తే.. బౌలర్ల ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా బౌలింగ్ ఎటాక్ కెప్టెన్ బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అలాగే హర్షల్ పటేల్ కూడా ఆసియా కప్‌కు కొద్ది రోజుల ముందే గాయంతో తప్పుకున్నాడు. టోర్నీ మధ్యలో రవీంద్ర జడేజా గాయంతో దూరమయ్యాడు. తాజాగా ఆవేశ్ ఖాన్ జ్వరంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. అతని స్థానంలో మరో బౌలింగ్ ఆప్షన్ లేక స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తీసుకున్నారు. అసలు ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టుపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని కాదని.. జింబాబ్వే టూర్లో పెద్దగా రాణించని ఆవేశ్ ఖాన్‌ను ఎంపిక చేశారు. అలాగే భువీ, అర్షదీప్, ఆవేశ్ ముగ్గురే పేసర్లను నమ్ముకున్నారు. నాలుగో పేసర్‌కు అవకాశం ఇవ్వలేదు. తీరా చూస్తే.. ముగ్గురు కూడా దారుణంగా విఫలం అవుతున్నారు. కానీ.. టీమిండియా వద్ద వేరే ఆప్షన్ లేదు. పైగా భువీ సరైన ఫిట్నెస్లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆవేశ్ ఖాన్ జ్వరంతో మ్యాచ్ దూరమయ్యాడు. ఇలా టీమిండియా బౌలర్లు ఫిట్నెస్ లేమితో ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టమైంది. ప్రపంచ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డైన బీసీసీఐ.. జట్టులోని బౌలర్ల ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మెగా టోర్నీలకు ముందే కీలకమైన ఆటగాళ్లుకు రెస్ట్ ఇచ్చి.. వారు ఏ విధంగా టోర్నీకి అందుబాటులో ఉండాలో చూసుకోవాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్మెంట్దే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. బుమ్రా, హర్షల్ పటేల్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లు తరచూ గాయాల పాలు అవుతున్నారు. ఏకంగా ప్రతిష్టాత్మక టోర్నీలకు దూరం అవుతున్నారు. మరి వారి స్థానాన్ని భర్తీ చేయడంలో అయినా టీమ్ మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకుంటుందా అంటే అదీ లేదు.. బుమ్రా, హర్షల్ పటేల్ లేని టీమ్‌లో షమీ నటరాజన్, మొహిసిన్ ఖాన్‌లను తీసుకోకుండా.. వెస్టిండీస్, జింబాబ్వే టూర్లలో విఫలం అయిన ఆవేష్ ఖాన్‌ను తీసుకున్నారు. ఇలా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకుండా, సరైన ఎంపికలు చేయకుండా.. టీమ్‌మేనేజ్‌మెంట్ టీమిండియాను బలహీన పరుస్తున్నారు. మరి ఈ విషయంలో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ పాత్ర ఏంటనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌గా ఉన్న కోచ్ ద్రవిడ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. మెగా టోర్నీలకు ముందు బౌలర్ల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, అలాగే గాయాల పాలయ్యే పరిస్థితి రాకముందే కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తూ వారిని జాగ్రత్తగా కాపాడుకోవడంతో పాటు బ్యాకప్ బౌలింగ్ ఎటాక్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పాక్‌పై టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు! We missed this bowler at this time#INDvsPAK2022 #INDvsPAK #arshdeepsingh #haar #Arshdeep #shami pic.twitter.com/E40RTO0PHa — Kundan patil (@Kundanp82985546) September 4, 2022