ఆసియా కప్‌లో భాగంగా సూపర్ ఫోర్లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌ను ఓడించి సూపర్ ఫోర్కు చేరిన టీమిండియాకు తొలి మ్యాచ్‌లో పాక్ షాకిచ్చింది. కాగా.. గ్రూప్ స్టేలో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపునకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన ఒక చిన్న మూవ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. లెఫ్ట్ హ్యాండర్ జడేజాను బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కంటే ముందు పంపాడు. దీంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను సులువుగా ఆడేలా ద్రవిడ్ అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఇది వర్క్అవుట్ కూడా అయింది. 29 బంతులు ఎదుర్కొన్న జడేజా 2 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి పాక్‌పై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. తాజాగా ఇదే స్ట్రాటజీని పాకిస్థాన్ ఇండియాపైనే ప్రయోగించింది. ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో మొహమ్మద్ నవాజ్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసింది. అతను అద్భుతంగా ఆడి 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో అదరగొట్టాడు. నవాజ్ ఆడిన ఇన్నింగ్స్ పాకిస్థాన్ విజయానికి తోడ్పాటు అందించింది. రనేరేట్ పెరిగిపోకుండా నవాజ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో విజయానికి చేరువైంది. కాగా.. పాకిస్థాన్ నవాజ్‌ను ముందు పంపే ప్లాన్‌ను తొలి మ్యాచ్‌లో ద్రవిడ్ నుంచి కాపీ కొట్టినట్లు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు, నషీమ్ షా, హూస్నైన్, రౌఫ్, నవాజ్ తలో వికెట్ తీసుకున్నారు. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులుచేసి రాణించాడు. నవాజ్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఆసిఫ్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో విలువైన 16 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అర్షదీప్, భువీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో చాహల్, పాండ్యా, భువీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నవాజ్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: లెఫ్ట్ హ్యాండర్ కావాలని తీసుకుంటే.. రైట్ హ్యాండ్‌తో ఆడి అవుటైన పంత్! Really proud to contribute in the victory. Go well boys #PakistanZindabad pic.twitter.com/UNLkEt7z0N — Muhammad Nawaz (@mnawaz94) September 4, 2022