అంతర్జాతీయ క్రికెట్ లో వరల్డ్ కప్ ఎంత ఫేమస్సో.. దేశవాళీ టోర్నీల్లో ఐపీఎల్ అంతే ఫేమస్. ఈ లీగ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో.. బెట్టింగ్ మాఫియా కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తూ వుంటుంది. ఐపీఎల్ టోర్నీ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఎన్నోసార్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే, ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. అయితే.. తాజాగా పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే నెట్‌వర్క్ ఉన్నట్లు సమాచారం అందడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్ లలో సీబీఐ దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక విషయాలు సేకరించిందని సమాచారం.
2019 ఐపీఎల్‌లో బెట్టింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేయడానికి సీబీఐ రెండు కేసులు దాఖలు చేసింది. ఓ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, “ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల నెట్‌వర్క్ గురించి సీబీఐకి సమాచారం అందిందని.. ఈ క్రమంలోనే దాడులు చేసినట్లు పేర్కొంది. పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా ఈ నెట్‌వర్క్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తోందన్నది వాదన. బెట్టింగ్ లావాదేవీల కోసం ముఠా సభ్యులు నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచారని.. ఈ ముఠాతో పలువురు బ్యాంకు అధికారులు కూడా కుమ్మక్కైనట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. దేశంలో బెట్టింగ్ ద్వారా సంపాదించిన సొమ్ములో కొంత భాగం హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేల్చింది. నిందితులు పాకిస్థాన్‌లోని వకాస్ మాలిక్‌తో టచ్‌లో వుంటున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో వకాస్ ఫోన్ నెంబర్ సైతం లభించిందని సమాచారం.
BREAKING: CBI files a case stating IPL betting network with help from Pakistan influenced the results of IPL 2019! pic.twitter.com/HVpjMOhYgI
— Cinematicsunited (@cinematicsunite) May 14, 2022
CBI raids underway at 7 locations in Delhi, Jaipur, Hyderabad & Jodhpur in connection with 2 cases registered to probe the syndicates that were involved in organizing betting on 2019 IPL matches & allegedly influenced the outcome of matches based on inputs from Pakistan: Sources
— ANI (@ANI) May 14, 2022
CBI registers FIRs in Pakistan-linked betting syndicate in 2019 IPL matches, searches underway at 7 locations
Read @ANI Story | https://t.co/L8CmXsuOsM#IPL #CBI #Betting pic.twitter.com/Cv3lrxxFT4
— ANI Digital (@ani_digital) May 14, 2022
ఇది కూడా చదవండి: Rajat Patidar: RCB బ్యాటర్ భారీ సిక్స్.. తలకు తగిలి బోరుమన్న ముసలాయన.. వీడియో వైరల్!
మొదటి ఎఫ్ఐఆర్‌లో దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసులను నిందితులుగా పేర్కొన్న సీబీఐ.. ఈ నెట్‌వర్క్ 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. నిందితుల బ్యాంకు ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.10 కోట్లపై లావాదేవీలు జరిగినట్లు సీబీఐ వెల్లడించింది. రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. వీరు 2010 నుంచి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వీరు జరిపిన లావాదేవీల విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని వెల్లడించింది. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు 43 లక్షలకు పైగా నిధులు వున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
IPL Betting – CBI files a FIR against a network of people influencing outcome of the UL match based on fake IDs and KYC documents
Refers to some matches played in 2019 in Delhi & other places#IPL2022 #IPLScam @IPL pic.twitter.com/CMTd53I8zU
— Bar & Bench (@barandbench) May 14, 2022