టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం (డిసెంబర్ 30)న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తుండగా రూర్కీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు, పంత్ కు నిద్ర రావడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని పరామర్శించడానికి వచ్చారు బాలీవుడ్ నటులు. పంత్ తో పాటుగా అతడి తల్లి, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
కారు ప్రమాదానికి గురైన పంత్ ను పరామర్శించడానికి వచ్చారు బాలీవుడ్ నటులు అనీల్ కపూర్, అనుపమ్ ఖేర్. అతడి అభిమానుల్లా మేం ఇక్కడికి వచ్చాం అని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనీల్ కపూర్, అనుపమ్ ఖేర్. ప్రస్తుతం రిషభ్ పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వారు తెలిపారు. పంత్ అద్భుతమైన వ్యక్తి అని, ఓ క్రికెటర్ గా అతడు ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచాడని వారు ప్రశంసించారు. ఇప్పుడు పంత్ త్వరగా కోలుకోవాలని దేశం మెుత్తం కోరుకుంటోంది. ఈ సందర్భంగా దేశ పౌరులు అందరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని వారు సూచించారు. త్వరలోనే అతడు కోలుకుని వస్తాడని ఆశిస్తున్నాం అని వారు పేర్కొన్నారు. పంత్ తల్లిని కలిసి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చాం అని అలాగే వారిని నవ్వించాం అని అనుపమ్, అనీల్ కపూర్ చెప్పుకొచ్చారు.
Actor @AnupamPKher @AnilKapoor visited at a private hosiptal in #Dehradun where cricketer @RishabhPant17 recovering after #RishabhPantCarAccident The actors met Pant’s mother and took stock of his health. Meanwhile @delhi_cricket mulling to shift Pant Delhi#RishabhPant pic.twitter.com/d36yN2tTpx
— Anupam Trivedi (@AnupamTrivedi26) December 31, 2022
Anil kapoor and anupam kher visited hospital to meet rishabh pant and his family ❤️ pic.twitter.com/WeKcnyvJwG
— Rishabh pant fans club (@rishabpantclub) December 31, 2022