టీమిండియా స్టార్ పేసర్ జస్పీత్ర్ బుమ్రా జాతీయా జట్టులోకి రావడానికి కారణం కోహ్లీనే అని టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. బుమ్రా టెస్టు అరంగేట్రం గురించి మాట్లాడిన భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతోనే బుమ్రా టెస్టు ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పాడు. 2018 సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అతను అనతికాలంలోనే ఫార్మాట్లకతీతంగా మేటి బౌలర్‌గా ఎదిగాడు. ‘2018 సౌతాఫ్రికా పర్యటనకు భారత జట్టు 10-12 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
ఆ సమయంలో నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌ను సాధన చేసిన విరాట్ కోహ్లీ అతని బౌలింగ్‌కు అమితంగా ఆశ్చర్యపోయాడు. అక్కడున్న బౌలర్ల అందరిలో అతనే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. దీంతో వెంటనే బుమ్రాను తొలి టెస్టులో ఆడించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి బుమ్రా కెరీరే మారిపోయింది. అయితే, అంతకుముందే బుమ్రా వన్డేల్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 27 టెస్టులు ఆడిన బుమ్రా 113 వికెట్లు పడగొట్టాడు. మరి భరత్ అరుణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సెహ్వాగ్ చెత్త రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ! టాప్‌లో సచిన్