టీమిండియా మాజీ సారధి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్కతాలో కొత్త బంగ్లాను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం గంగూలీ తన కుటుంబ సభ్యులతో కలిసి బెహలాలోని బీరెన్ రాయ్ రోడ్లోని రాజభవన గృహంలో నివసిస్తున్నారు. 48 సంవత్సరాల అనంతరం తన పూర్వీకుల ఇంటి నుంచి కొత్త భవనంలోకి మారనుండడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. గంగూలీ కొనుగోలు చేసిన కొత్త బంగ్లా విలువ సుమారు రూ. 40 కోట్లు అని సమాచారం.
కోల్కతా, లోవర్ రాడన్ స్ట్రీట్లో 23.6 కొత్తా(దాదాపు 10,280 స్క్వేర్ఫీట్) కలిగిన రెండంతస్తుల భవనాన్ని గంగూలీ కొనుగోలు చేశాడు. ఈ ప్రాపర్టీ మొత్తాన్ని భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ గంగూలీ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. పాత భవనమే అయినప్పటికి.. రోడ్డుకు దగ్గరగా ఉండడం.. రియల్ ఎస్టేట్ కు అనుకూలంగా ఉండడంతో దాదా ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, వ్యాపారవేత్తలు అయిన అనుపమ బగ్రీ, కేశవ్ దాస్ అతని కుమారుడు నికుంజ్ నుండి గంగూలీ ఈ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Sourav Ganguly’s new home pic.twitter.com/vGigNQUqjZ
— Akash Kharade (@cricaakash) May 20, 2022
ఇది కూడా చదవండి: Virender Sehwag: గంగూలీ కొత్త జట్టును నిర్మించాడు.. మరి కోహ్లి అలా చేశాడా?: వీరేంద్ర సెహ్వాగ్
ఇక క్రికెట్ పరంగా చూస్తే.. 1996లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన గంగూలీ 2008లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా, ఐసీసీ చైర్మన్ గా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కెరీర్ మొత్తంలో 113 టెస్టులు ఆడిన గంగూలీ 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 239 పరుగులు. ఇక.. 311 వన్డేలు ఆడిన గంగూలీ 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 183 పరుగులు. ఇక.. ఐపీఎల్ లో 59 మ్యాచులాడిన గంగూలీ 1349 పరుగులు చేశాడు.
#OnThisDay in 1996, Test cricket witnessed ‘Dadagiri’ for the first time, as @SGanguly99 smashed 131 on debut at Lord’s to kick-start an unforgettable international career! 😍 #Legend pic.twitter.com/hDXH1NXTKt
— Star Sports (@StarSportsIndia) June 22, 2018
Sourav Ganguly was absolutely phenomenal in ODI cricket in his era. His career in numbers. @SGanguly99 pic.twitter.com/8kEwK3wg0b
— Fanisko NFTs (@FaniskoNFTs) February 17, 2016