ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. ఏకంగా ఐదు సార్లు టైటిల్ విజేత. కానీ.. ఐపీఎల్ 2022లో మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చింది. వరుస ఓటములతో చెత్త రికార్డు మూటగట్టుకుంది. దీంతో ఆ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ మెగా వేలంలో సరైన జట్టును కొనుగోలు చేయలేదంటూ ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు.
ఇలా ఈ ఏడాది సీజన్‌తో ఇబ్బందుల పడ్డ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి మరో షాక్ తగిలింది. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కింద బీసీసీఐ నీతా అంబానీకి నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు మేరకు ఎథిక్స్ కమిటీ సభ్యుడు వినీత్ శరణ్.. నీతా అంబానీకి నోటీసులను జారీ చేశారు. కాగా ఇటివల ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్ గ్రూప్ దక్కించుకుందని.. రిలయన్స్ కంపెనీలో నీతా అంబానీ సహ యజమానితో పాటు ముంబై ఇండియన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు.. ఇది బీసీసీఐ అండర్ రూల్ 39 (బీ) కింద కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందికి వస్తుందని సంజీవ్ గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు.
నీతా అంబానీ తనపై వచ్చిన ఆరోపణలపై సెప్టెంబర్ 2వ తేదీలోగా రాతపూరక సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుందని ఈ నోటీసుల్లో వినీత్ శరణ్ స్ఫష్టం చేశారు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆమెపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The BCCI ethics officer has asked Nita Ambani to file a written response to conflict of interest allegations levelled against her. She’s the owner of Mumbai Indians and also a director at the Reliance Industries which bought the IPL digital rights. (Reported by TOI).
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 6, 2022
ఇది కూడా చదవండి: అందంగా కనిపించడానికి నేను హీరోని కాదు.. క్రికెటర్‌ని: రోహిత్ శర్మ!