టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ మరో కొత్త అవతారంలో అలరించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ పదహారో సీజన్లో బాలయ్య కామెంట్రీ చేయనున్నారు. మిగిలిన విశేషాలు..
నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా క్రేజే. సినిమాలతో పాటు ‘అన్‌స్టాపబుల్’ లాంటి టాక్ షోలతోనూ ఈతరం ఆడియెన్స్‌ను ఆయన ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ పదహారో సీజన్లో వ్యాఖ్యాతగా అలరించనున్నారు బాలయ్య. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఓ ట్వీట్ చేసింది. టోర్నీ ఫస్ట్ డే ఐపీఎల్ కామెంట్రీ వేరే లెవల్లో ఉండబోతోందని ట్వీట్లో పేర్కొంది. కామెంట్రీ బాక్స్‌లో బాలయ్య తనదైన శైలిలో సినిమాలను, క్రికెట్‌ను అనుసంధానించి ఎలా కామెంట్రీ చేస్తాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, బాలయ్యకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు బయటపెట్టారు. చిన్నతనం నుంచి క్రికెట్‌ను ఆయన రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారట.
కాలేజ్ డేస్‌లో భాతర మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్, ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలసి బాలయ్య క్రికెట్ ఆడేవారట. గతంలో సినీ స్టార్స్ ఆడే సెలబ్రిటీ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు బాలయ్య సారథ్యం వహించారు. ఇలా ప్రతి దశలోనూ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించారాయన. జెంటిల్మన్ గేమ్ మీద ఉన్న అమితమైన ఆసక్తితోనే స్టార్ స్పోర్ట్స్ తెలుగు అడగగానే కామెంట్రీకి బాలయ్య కాదనలేకపోయారని తెలుస్తోంది. కాగా, మార్చి 31న ఐపీఎల్ టోర్నీ మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ – నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మరి.. ఐపీఎల్లో బాలయ్య కామెంట్రీ చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎
ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩
నందమూరి బాలకృష్ణ గారు😍తెలుగుజాతి గర్వపడేలా 🔥
సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳
ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD#IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn pic.twitter.com/GpARnqMdgg
— StarSportsTelugu (@StarSportsTel) March 26, 2023