పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను పాక్ అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుతుంటారు. కానీ.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ అవుటైన విధానం చూస్తే.. అలా పోల్చడం తప్పని స్పష్టంగా అర్థమవుతుంది. బాల్‌ను రెండు వైపుల స్వింగ్ చేయగల బౌలర్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆడాలో కోహ్లీకి తెలుసు. కానీ బాబర్ మాత్రం బౌలర్‌ను తక్కువగా అంచనా వేసి.. వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ బయటికి పడిన బాల్‌ను ఆడకూడదని బాబర్ బ్యాట్ పైకెత్తాడు. కానీ.. బాల్ లోపలికి అద్భుతంగా స్వింగ్ అవుతూ.. వికెట్లను గిరాటేసింది. అద్భుతమైన డెలవరీతో షాక్ తిన్న బాబర్.. ఎలా అవుట్ అయ్యానూ అనుకుంటూ అలానే నిలబడిపోయాడు.
దీంతో.. సరైన బంతి పడనంత వరకు ప్రతి వాడు విరాట్ కోహ్లీ లానే ఫీలవుతుంటారంటూ.. కోహ్లీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ పాకిస్థాన్ ఓడిపోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రావాల్పిండిలో జరిగిన హైస్కోరింగ్ తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్.. రెండో టెస్టులో విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే.. రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లను పాక్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కానీ.. బ్యాటర్ల వైఫల్యం పాకిస్థాన్ కొంపముంచింది. 354 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. ఓపెనర్లు షఫీక్, మొహమ్మద్ రిజ్వాన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ.. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జెమ్స్ అండర్సన్ అద్భుతమైన డెలవరీతో రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు తొలి వికెట్ అందించాడు. 30 పరుగులు చేసి రిజ్వాన్ పెవిలియన్ చేరాడు.
వన్ డౌన్‌లో వచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను సైతం అండర్సన్ ఇబ్బంది పెట్టాడు. 9 బంతుల్లో కేవలం ఒక్క పరుగు చేసిన బాబర్.. ఇంగ్లండ్ బౌలర్ రాబిన్‌సన్ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన రాబిన్‌సన్ ఐదో బంతిని అద్భుతమైన ఇన్ స్వింగర్‌గా వేశాడు. ఎక్కడో ఆఫ్ స్టంప్ అవతల పడుతున్న బంతి.. వికెట్లను గిరాటేసింది. నిజానికి ఆ బంతిని ఆడకుండా వదిలేసేందుకే బాబర్ సిద్ధమయ్యాడు. కానీ.. అనూహ్యంగా స్వింగ్ అయిన బాల్.. నేరుగా వికెట్లకు తాకింది. దీంతో ఏమి అర్థం కాని బాబర్ అజమ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. దీంతో 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్.. 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాలో పడింది. ఆ తర్వాత.. సౌద్ షకీల్(94), ఇమామ్ ఉల్ హక్(60), మొహమ్మద్ నవాజ్ (45) పరుగులతో రాణించినా.. పాక్‌ను గెలిపించలేకపోయారు.
What a delivery Robinson with Babar Azam pic.twitter.com/djtvHWZYjA
— Naveed arshad NA 75رھنما پاکستان تحریک انصاف (@A30393299Arshad) December 11, 2022
Babar Azam misjudged Ollie Robinson’s inswinger ☝️
England gets two big wickets in quick succession.
📸: Sony Liv pic.twitter.com/MGEPpPU7TJ
— CricTracker (@Cricketracker) December 11, 2022