బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో తీసింది తక్కువ వికెట్లే అయినా చరిత్ర సృష్టించాడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. ఈ క్రమంలోనే మిస్టరీ స్పిన్నర్ అశ్విన్ కు సైతం సాధ్యం కాని రికార్డును సాధించి, బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇరు జట్ల బ్యాటర్లు తమ బ్యాటింగ్ సత్తా చూపించడంతో.. ఈ టెస్ట్ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. దాంతో ఈ సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో ట్రవిస్ హెడ్ వికెట్ తీయ్యడం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు స్టార్ స్పిన్నర్ అక్షర్ పటేల్. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. దాంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు తమ బ్యాట్ కు పనిచెప్పారు. దాంతో ఈ మ్యాచ్ డ్రా కాక తప్పలేదు. అయితే ఈ టెస్ట్ గెలిచి సిరీస్ ను సమం చేయాలనుకున్న ఆసిస్ కు భంగపాటు తప్పలేదు. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఆసిస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ ను అవుట్ చేయడం ద్వారా టీమిండియా స్టార్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అదీకాక భారత స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ట్రవిస్ హెడ్ వికెట్ తీయడం ద్వారా అక్షర్ అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున అత్యంత వేగవంతంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు జస్ప్రీత్ బుమ్రా పేరు మీద ఉంది. బుమ్రా 2465 బంతుల్లో 50 వికెట్లు తీస్తే.. అక్షర్ 2205 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. వీరి తర్వాత మూడో స్థానంలో కర్సన్ ఘావ్రి 2534 బంతుల్లో 50 వికెట్లు తీశాడు. ఇక నాలుగో స్థానంలో టీమిండియా వెంటరన్ స్టార్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. కాగా ఈ టెస్ట్ లో బ్యాట్ తోనూ రాణించి 79 పరుగులు చేసి.. జట్టు పటిష్ట స్థితికి కారణం అయ్యాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేయగా.. భారత్ కూడా ధీటైన జవాబు ఇచ్చింది. దాంతో తన తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసింది. ఇక ఆసిస్ రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి.. డిక్లేర్ చేసింది. ఇక భారీ సెంచరీతో భారత్ ను తిరుగులేని స్థితిలో నిలిపిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను జడేజా అందుకున్నాడు. మరి మిస్టరి స్పీన్నర్ అశ్విన్ వల్ల కాని రికార్డును అక్షర్ పటేల్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Axar Patel becomes fastest to have completed 50 wickets in Test cricket for India in terms of balls in the history.
Fastest to picks 50 wickets in Test cricket for India:- (In terms of balls)•Axar Patel – 2205
•Jasprit Bumrah – 2465
•Karsan Ghavri – 2534
•Ravi Ashwin – 2597 pic.twitter.com/BoCvdNqdah— 𐍃𐌵𐌱𐌷𐌻𐌽𐌺𐌻𐍂 (@Suvhu0854) March 13, 2023