టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా టీమ్ చీటింగ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ జట్టు చేసిన ఒక చర్య ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ టెస్టు తొలి రెండ్రోజులు ఆసీస్‌దే పైచేయి అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 469 రన్స్ భారీ స్కోరు చేసింది కంగారూ టీమ్. ట్రావిస్ హెడ్ (163), స్టీవెన్ స్మిత్ (121) సెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 296 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఒక దశలో 151 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో అజింక్యా రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) టీమ్‌కు అండగా నిలిచారు. నిప్పులు చెరుగుతున్న ఆసీస్ బౌలర్లకు అడ్డుగా నిలిచారు. వీళ్లిద్దరి పోరాటంతో భారత్ 296 రన్స్ చేసింది. ఒకవేళ వీళ్లు కూడా టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌లాగే ఫెయిల్ అయ్యుంటే టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చేది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 123 రన్స్ చేసింది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీలు కొట్టిన ట్రావిస్ హెడ్ (18), స్టీవెన్ స్మిత్ (34)ను రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు త్వరగానే ఔట్ చేశారు. మార్నస్ లబుషేన్ (41 నాటౌట్), కామెరాన్ గ్రీన్ (7 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఆధిక్యం పెరగకుండా ఆసీస్‌ను భారత్ ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే అంత మంచిదనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. భారత ఇన్నింగ్స్ టైమ్‌లో ఆసీస్ చేసిన ఒక పనిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు కంగారూ టీమ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆసీస్ ప్లేయర్లు 16, 18వ ఓవర్లలో కావాలనే బాల్ ఆకారాన్ని మార్చేశారని విమర్శలు వస్తున్నాయి. బాల్ టాంపరింగ్ చేసినట్లు స్పష్టంగా టీవీలో కనిపించడంతో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. చీటింగ్ చేసిన ఆసీస్‌పై ఐసీసీ సస్పెన్షన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ వివాదంపై మ్యాచ్ రిఫరీ, ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
Basit Ali claimed that the Australian bowlers engaged in ball-tampering without being noticed by umpires, players, or commentators
Read More: https://t.co/FCWkDpZ6Qh#WTC23 | #AUSvIND pic.twitter.com/4JMsXFFWpP
— Cricket Pakistan (@cricketpakcompk) June 9, 2023