భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 9న నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ సమరానికి తెరలేవనుంది. గత మూడు సిరీస్‌లలో పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా ఈ సారి పక్కా ప్లానింగ్‌తో వచ్చినట్లు కనిపిస్తోంది. సిరీస్ ఆరంభానికి పది రోజులు ముందుగానే భారత్‌కు వచ్చిన ఆసీస్.. పాత్ పిచ్‌లపై, స్పిన్ బౌలింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్‌లో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే.. సిరీస్‌లో పైచేయి సాధించవచ్చనేది వారి నమ్మకం. అందుకు తగ్గట్లే.. స్పిన్‌కు అనుకులించే పిచ్‌లపై నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆసీస్ బ్యాటర్లు. అలాగే వారి బౌలింగ్ ఎటాక్ సైతం బలంగా ఉన్నా.. హెజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ గాయాలతో తొలి టెస్టుకు దూరం కావడం ఆసీస్‌కు పెద్దగా భావించవచ్చు.
అలాగే ఈ సిరీస్ టీమిండియాకు సైతం ఎంత కీలకం. 2021లో మిస్ అయిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌ను మరోసారి పొందాలంటే.. ఈ నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌ను 2-0 లేదా 3-1తో ఓడించాలి. అప్పుడే భారత్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. దీంతో రోహిత్ సేన సైతం ఈ సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలా ఇరు జట్లు కూడా ఎలాగైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. మరి ఈ సిరీస్‌లో గెలుపు అంచనాలను ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ.. శ్రీలంక దిగ్గజ మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే మాత్రం.. భారత్-ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఎవరు కైవసం చేసుకోనున్నారో తేల్చిపారేశాడు.
జయవర్దనే మాట్లాడుతూ.. ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. ఇండియాలోని పరిస్థితులకు తగ్గట్లు ఆసీస్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది. అలాగే ఆసీస్‌కు మంచి బౌలింగ్ ఎటాక్ ఉంది. ఇండియా బ్యాటింగ్ లైనప్ కూడా ఆసీస్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ సిరీస్‌లో విజేత ఎవరో చెప్పడం కాస్త కష్టమే కానీ.. తొలి టెస్టులో విజయం సాధించిన జట్టుకు మంచి స్టార్ట్ దక్కినట్లు అవుతుంది. అలాగే.. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా అన్ని విధాల పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 2-1తో గెలుస్తుంది. అదే విధంగా భారత్ ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.’ అని అన్నాడు. మరి జయవర్దనే అంచనాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ind vs Aus Test 🥵🥵🥵🔥pic.twitter.com/UAccgFDNLF
— SAI (@KRlSHNASAl) January 28, 2023