ఆసియా కప్ 2022లో శ్రీలంక సూపర్ ఫోర్కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో లంకేయులు అదరగొట్టారు. 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. రికార్డు విజయాన్ని నమోదు చేశారు. యూఏఈలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌గా నిలిచింది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, గ్రూప్ బీ నుంచి అఫ్ఘనిస్థాన్ రెండేసి విజయాలతో సూపర్ ఫోర్కు దూసుకెళ్లాయి. గురువారం బంగ్లాపై విజయంతో శ్రీలంక సైతం సూపర్ ఫోర్కు చేరింది. కాగా మ్యాచ్ తర్వాత శ్రీలంక ఆటగాడు నాగిన్ డాన్స్‌తో రచ్చ రచ్చ చేశాడు. మ్యాచ్ మొత్తానికి ఆ నాగిన్ డాన్స్ హైలెట్‌గా నిలిచింది. బంగ్లాదేశ్ ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్స్ అయిన నాగినీ డాన్స్‌ను లంకేయులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
2018 నిధాస్ ట్రోఫీ సందర్భంగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ చివర ఓవర్ వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కుశల్ పెరిరా(61), థీశార పెరిరా(58) పరుగుల రాణించడంతో శ్రీలంక మంచి ఫైటింగ్ టోటల్ ఇస్తుంది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(50), మొహమ్మదుల్లా(43 నాటౌట్) అద్భుతంగా ఆడి.. బంగ్లాదేశ్‌కు థ్రిల్లింగ్ విక్టరీ అందిస్తారు. ప్రతిష్టాత్మక నిధాస్ ట్రోఫీలో టీమిండియాతో ఫైనల్లో తలపడేందుకు బంగ్లాదేశ్ అర్హత సాధించడంతో బంగ్లా ఆటగాళ్ల సంతోషం పట్టలేక గ్రౌండ్లో నాగిన్ డాన్స్‌తో రచ్చరచ్చ చేస్తారు. అప్పట్లో వీరి పిల్లచేష్టలు తెగ వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఆసియా కప్‌లో నాకౌట్ మ్యాచ్‌లో శ్రీలంక కూడా సరిగ్గా అలాంటి థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి ఆసియా కప్ నుంచి బంగ్లాదేశ్‌ను ఇంటికి పంపించింది. 2018లో నిధాస్ ట్రోఫీ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఇప్పుడు ఆసియా కప్‌లో బదులు తీర్చుకున్నట్లు అయింది. అందుకే లంకే ఆటగాడు బంగ్లా మార్క్ నాగినీ డాన్స్‌తోనే వారికి బుద్ధిచెప్పాడు. విశేషం ఏమిటంటే.. అప్పుడు బంగ్లాదేశ్ కూడా రెండు వికెట్ల తేడాతోనే గెలిచింది. ఇప్పుడు శ్రీలంక కూడా రెండు వికెట్లతోనే విజయం సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 183 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెహిదీ హసన్ మీర్జా 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38, అఫిఫ్ హోస్సేన్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి రాణించారు. చివరర్లో మొసద్దెక్ హోస్సేన్ 9 బంతుల్లో 4 ఫోర్లుతో 24 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో హసరంగా, కరణరత్నే రెండేసి వికెట్లు పడగొట్టారు. దిల్లాన్, మహీశ థీక్షణ, ఫెర్నాండో తలో వికెట్ తీసుకున్నారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసి గెలుపొందింది. కుశాల్ మెండీస్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేసి అదరగొట్టాడు. డసన్ షనక 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో లంక టెయిలండర్లు సైతం విలువైన పరుగులు చేయడంతో ఆసియా కప్‌లో లంక సూపర్ ఫోర్కు దూసుకెళ్లింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో ఇబాదత్ హోస్సెన్ మూడు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్ రెండు పడగొట్టాడు. ముస్తాఫిర్ రెహ్మాన్, మెహ్దీ హసన్ చెరొక వికెట్ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్రదర్శన, అలాగే నాగిన్ డాన్స్‌తో బంగ్లాపై బదులు తీర్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: స్టేడియంలో బతుకమ్మ ఆడిన పాకిస్థాన్, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్!
Bangladesh
Sri lanka waited 4 years to complete thier revenge ✌️
S#AsiaCupT20 #PAKvHK #BanvsSl pic.twitter.com/c8KRNnRXK9— CRICKET UPDATES✨ (@HamidTweets10) September 1, 2022
Wining moment for srilanka #BANVSSL #BANvSL pic.twitter.com/oYstSfM683
— DD Sports (@Mahesh13657481) September 1, 2022
Feeling of victory over Bangladesh srilankan team right now 🐍🐍😂👇
Country who’s suffering lot’s of things from last many years just these cricketing wining joy thing can make them little bit of smiles.#AsiaCupT20#BANVSSL pic.twitter.com/Xy1MAOoUNe
— Rajkumar 🇮🇳 (@ParthShukla0198) September 1, 2022
#SriLanka team did a nagin dance to celebrate their win against #Bangladesh in a record run chase. #AsiaCup2022 #BanVsSL pic.twitter.com/ze08OkJchr
— Kumar Manish (@kumarmanish9) September 1, 2022