ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో టీమిండియా గెలిచేసింది. ఆశ్విన్-జడేదా చెరో ఐదు వికెట్లు తీసి కేక పుట్టించారు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇదే మ్యాచులో వీళ్లిద్దరూ గొడవ పడ్డారని కూడా అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
టీమిండియా అనగానే అద్భుతమైన బ్యాటర్లు ఎలా గుర్తొస్తారో ఎప్పటికప్పుడు రికార్డులు నెలకొల్పే స్పిన్నర్లు కూడా అంతలానే గుర్తొస్తారు. గత పదేళ్లకు పైగా స్పిన్ బాధ్యతల్ని అశ్విన్-జడేజా ద్వయం చూసుకుంటోంది. ధోనీ కెప్టెన్ గా ఉన్న టైంలో ఈ ఇద్దరూ స్టార్ ప్లేయర్లు అద్భుతాలు చేశారు. నువ్వా నేనా అని పోటీపడుతూ వికెట్లు తీస్తూ వచ్చారు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం అశ్విన్ టెస్టులకే పరిమితం కాగా, జడేజా మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ దుమ్మురేపుతున్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తాజాగా జరిగిన తొలి టెస్టులో ఈ ఇద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. అదే టైంలో గొడవ కూడా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగ్ పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టు జరిగింది. భారత జట్టు చెలరేగి ఆడటంతో మూడో రోజు పూర్తవకుండానే మ్యాచ్ ముగిసింది. ఇక ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జడేజా, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్.. ఐదు వికెట్ల ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఇలా సీనియర్లు ఇద్దరూ కూడా తమ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుని చీల్చిచెండాటం బాగానే ఉంది. కానీ మ్యాచ్ లో జరిగిన సంఘటన, తర్వాత రోహిత్ చెప్పిన మాటలు పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఇవన్నీ క్రికెట్ ప్రేమికుల మధ్య పెద్ద చర్చకు తెరలేపాయి.
తొలి టెస్టు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘జడేజా వచ్చి నాకు బంతి ఇవ్వు, మరో వికెట్ తీస్తే 250 వికెట్ల మార్క్ అందుకుంటానని అంటాడు. అదే టైంలో అశ్విన్ వచ్చి నాకు బౌలింగ్ కావాలని అడుగుతాడు. ఇద్దరిలో ఎవరికి బంతి ఇవ్వాలో అనేది ఈ మ్యాచ్ లో నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఇది సరదాగా చెప్పినప్పటికీ.. టెస్టు జరుగుతుండగానే అశ్విన్-జడేజా మధ్య చిన్నపాటి గొడవ జరిగిందా అనిపిస్తుంది. ఇద్దరూ కూడా ఈ మ్యాచుతోనే అరుదైన వికెట్ల మార్క్ ని చేరుకున్నారు. అందులో భాగంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వాళ్లిద్దరూ వ్యక్తిగత రికార్డులు సాధించేందుకు తాపత్రయపడుతున్నారు. ఇలాంటప్పుడు మ్యాచ్ గెలిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఓడిపోతే మాత్రం ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. ఇప్పటికైనా సరే జడేజా-అశ్విన్.. రికార్డులు కోసం కాకుండా జట్టు విజయం కోసం పాటుపడాలని అభిమానులు సూచిస్తున్నారు. మరి జడేజా-అశ్విన్ గొడవ పడ్డారంటూ వస్తున్న న్యూస్ పై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.