క్రికెట్‌లో ఒక జట్టు ఛాంపియన్‌గా నిలవాలంటే.. గొప్ప గొప్ప బ్యాటర్లు, అద్భుతమైన బౌలర్లు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు మించి మంచి ఫీల్డర్లుగా కూడా ఉండాలి. అప్పుడే ఒక జట్టు ఛాంపియన్‌గా మారుతుంది. ఇదే విషయాన్ని.. 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా చేసి చూపించింది. మిగతా జట్లతో పోలిస్తే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఒక అడుగు ముందే ఉండేది. ప్రాణం పెట్టి ఫీల్డింగ్ చేయడమంటే ఏంటో ఆస్ట్రేలియా జట్టును చూసి నేర్చుకోవచ్చనే విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. టీమిండియా కూడా ఫీల్డింగ్‌లో మెరుగైన తర్వాత.. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
ఇక కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ప్రభావం కొంత తగ్గుతున్నా.. ఫీల్డింగ్ విషయంలో మాత్రం వారి స్టాండెడ్స్ వేరే లెవల్‌లోనే ఉంటున్నాయి. ఆ విషయాన్ని మరోసారి రుజువుచేస్తూ.. ఆసీస్ ప్లేయర్ యాష్టన్ అగర్ అద్భుత ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లో దురదృష్టం కొద్ది సెమీస్‌కు చేరలేకపోయిన ఆస్ట్రేలియా.. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ సాధించి మంచి ఊపుమీదున్న ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా తొలి వన్డే గురువారం జరగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(134) సెంచరీతో రాణించాడు.
కాగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆస్ట్రేలియా కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో షార్ట్ లెంగ్త్ డెలవరీని డేవిడ్ మలాన్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అక్కడే కాచుకుని కూర్చున్న అగర్.. దాదాపు సిక్స్ వెళ్లిపోయిన బంతిని గాల్లో పక్షిలా అంతెత్తుకు ఎగురుతూ.. గాల్లోనే ఆ బంతిని అందుకుని బౌండరీ లైన్ లోపలికి విసిరాడు. దీంతో ఆరు పరుగులు రావాల్సిన చోట ఇంగ్లండ్ కేవలం ఒక్క పరుగుతోనే సరిపెట్టుకుంది. ఈ అద్భుత ఫీల్డింగ్‌తో అగర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే ఇదే మ్యాచ్‌లో లియామ్ డాసన్‌ను అద్భుత త్రో అగర్ రనౌట్ కూడా చేశాడు. కానీ.. ఈ రనౌట్ కంటే కూడా అతను సెవ్ చేసిన 5 రన్స్ ఫీల్డింగ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
That’s crazy!
Take a bow, Ashton Agar #AUSvENG pic.twitter.com/FJTRiiI9ou
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
OMG Ashton Agar 😮 What a save!#AUSvENG pic.twitter.com/fsQEqsrDTo
— ESPNcricinfo (@ESPNcricinfo) November 17, 2022