అంతర్జాతీయ క్రికెట్‌లో సాధారణంగా ఆటగాళ్లు బాల్ తగిలినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోవడం సహజం. చాలా సార్లు బ్యాటర్లకు తగిలితే.. కొన్ని సందర్భాల్లో ఫీల్డర్లు సైతం బాల్ తగిలి గాయపడుతుంటారు. కానీ.. విచిత్రంగా సౌతాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే ఫీల్డింగ్ చేస్తూ.. కెమెరా తగిలి గ్రౌండ్‌లోనే కిందపడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన మంగళవారం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా చోటు చేసుకుంది. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత మ్యాచ్‌ను మరింత క్లియర్‌గా వివిధ యాంగిల్స్‌లో వీక్షకులకు చూపించేందుకు క్రికెట్‌లోకి అధునాతన టెక్నాలజీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాటిలో డీఆర్‌ఎస్‌తో పాటు స్పైడర్ కెమెరా కూడా ఒకటి.
మ్యాచ్‌లో పలు రకాల యాంగిల్స్‌ను చిత్రీకరించేందుకు స్పైడర్ కెమెరాను వాడుతున్నారు. ఈ కెమెరా స్టేడియం రూఫ్స్ నుంచి తీగల ద్వారా పనిచేస్తుంది. తీగల ఆధారంగా గాల్లో అటూ ఇటూ వెళ్తూ.. షూట్ చేస్తుంటుంది. మ్యాచ్‌లో బ్రేక్ వచ్చిన సందర్భాల్లో గాల్లో ఉండే ఈ స్పైడర్ కెమెరా.. కాస్త కిందకు దిగి వీడియో తీస్తోంది. అలానే.. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా టెస్టులో కూడా స్పైడర్ కెమెరా కాస్త కిందకు దిగింది. అయితే.. ఒక వైపు నుంచి మరో వైపుకు చాలా వేగంగా వెళ్తున్న కెమెరా.. మధ్యలో సౌతాఫ్రికా ప్లేయర్ అన్రిచ్ నోర్జేను బలంగా తాకింది. ఊహించని దెబ్బతో బిత్తరపోయిన నోర్జే అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే.. ఆ దెబ్బ అంత తీవ్రం కాకపోవడంతో మళ్లీ లేచిన నోర్జే తిరిగి ఫీల్డింగ్‌కు వెళ్లిపోయాడు.
ప్రస్తుతం నోర్జేను స్పైడర్ కెమెరా ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగడంతో ప్రొటీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఈ దశలో కైల్ వెర్రెయిన్నే(52), మార్కో జాన్సన్(59) పరుగులతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. వారిద్దరు అవుట్ అయిన తర్వాత మళ్లీ వికెట్ పతనం మొదలైంది. దీంతో.. సౌతాఫ్రికా 189 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా.. ఈ మ్యాచ్ డబుల్ సెంచరీతో డేవిడ్ వార్నర్ చెలరేగాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో నోర్జేను స్పైడర్ కెమెరా ఢీకొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Who said cricket isn’t a contact sport?
South African player Anrich Nortje hit by the aerial camera at the #BoxingDayTest
Meanwhile Warner has his century & Australia only two wickets down and 2 runs away from SA’s first innings total (Warner on 115 & Smith on 39) pic.twitter.com/ZafPYIJPue
— The Sage (@SarkySage) December 27, 2022
Flying fox camera just took out Nortje #AUSvsSA pic.twitter.com/ewqS63a5M5
— corbpie (@corbpie) December 27, 2022