అంతర్జాతీయ క్రికెట్‌లో సాధారణంగా ఆటగాళ్లు బాల్ తగిలినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోవడం సహజం. చాలా సార్లు బ్యాటర్లకు తగిలితే.. కొన్ని సందర్భాల్లో ఫీల్డర్లు సైతం బాల్ తగిలి గాయపడుతుంటారు. కానీ.. విచిత్రంగా సౌతాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే ఫీల్డింగ్ చేస్తూ.. కెమెరా తగిలి గ్రౌండ్‌లోనే కిందపడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన మంగళవారం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా చోటు చేసుకుంది. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత మ్యాచ్‌ను మరింత క్లియర్‌గా వివిధ […]