ప్రస్తుతం టీమిండియా ముందున్న లక్ష్యం ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడం. దీని కోసం జట్టులో ప్రయోగాలు చేస్తూ.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు భారీగా అవకాశాలు ఇస్తున్నారు. రెండు మెగా టోర్నీల్లో విజయం సాధించేందుకు పటిష్టమైన జట్టు తయారు చేసేందుకు బీసీసీఐ, కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లో అనేక మార్పులు చూశాం. తాజాగా ఆసియా కప్ కోసం జట్టును కూడా ప్రకటించారు. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక ఆధార పడి ఉంది.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు సైతం టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో ఏఏ ఆటగాళ్లు ఉండాలి అనే విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా టీ20 వరల్డ్ కప్ కోసం ఎలాంటి జట్టు ఉండాలో వెల్లడించాడు. ప్రస్తుతం ఉన్న జట్టు పరిస్థితులను, ఆటగాళ్ల ఫామ్‌ను విశ్లేసిస్తూ.. టీమిండియాలో ఫినిషర్‌గా ఉన్న వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
అజయ్ జడేజా మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా అగ్రెసివ్ క్రికెట్ ఆడుతుందని.. జట్టులో యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. కానీ.. రోహిత్ శర్మ అగ్రెసివ్ స్ట్రాటజీనే వరల్డ్ కప్‌లో కూడా అమలు చేస్తే.. కోహ్లీ అవసరం జట్టుకు ఉండదు. రోహిత్, రాహుల్, పంత్, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యాతో టీమిండియా పటిష్టంగానే ఉంది. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ జట్టులో ఉంటే అప్పుడు దినేష్ కార్తీక్ జట్టులో కచ్చితంగా ఉండాలి. వీరిద్దరూ ఫెయిల్ అయినా కార్తీక్‌పై భరోసా పెట్టుకోవచ్చు.
అలా కాకుండా.. ఫామ్‌లో లేని కోహ్లీని పక్కనపెడితే అప్పుడు దినేష్ కార్తీక్ అవసరం జట్టుకు ఉండదు. ఎందుకంటే మిగతా వారంత అగ్రెసివ్ క్రికెటే ఆడుతున్నారు. అప్పుడు ఫినిషర్ రోల్ అవసరం ఉండదు. దీంతో దినేష్ కార్తీక్ మళ్లీ కామెంట్రీ చేసుకోవాలి. అతనొక మంచి కామెంటేటర్ అతని కోసం నా పక్కన కామెంటేటర్ సీట్ ఎప్పుడూ ఉంటుంది.’ అని తెలిపారు. ఇక టీ20 జట్టులో బౌలర్లుగా షమీ, భువనేశ్వర్, అర్షదీప్ సింగ్, చాహల్ ఉండాలని, అశ్విన్, అక్షర్ పటేల్‌లలో ఒక్కరి తీసుకోవచ్చని జడేజా అభిప్రాయపడ్డాడు. మరి టీ20 వరల్డ్ కప్ కోసం అజయ్ జడేజా జట్టు ఎంపిక విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
“Dinesh Kartik Is Only Good As A Commentator, Not As…….” Says Ajay Jadeja#crickettwitter #cricketnews #dineshkarthikhttps://t.co/727fcf3x7d
— CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) August 9, 2022
ఇది కూడా చదవండి: ఆ ఇద్దరి వల్లే మళ్ళీ జట్టులోకి వచ్చాను.. కెరీర్ విషయంలో ఓపెన్ అయిన దినేష్ కార్తీక్