ఐపీఎల్ 2022 సీజన్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ లీగ్ తర్వాత వచ్చే నెల సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఆ సిరీస్ కు ఇప్పటికే బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్ల తీరును కొందరు తప్పుబడుతున్నారు. టాలెంట్ ఉన్న వారిని ఎప్పటికీ జట్టులోకి రానివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఎందుకు మాట్లాడుతున్నారంటే.. అది రాహుల్ త్రిపాఠి కోసమే. ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎంతో అద్భుతంగా రాణించిన రాహుల్ త్రిపాఠికి మళ్లీ నిరాశే మిగిలింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ 2022 సీజన్ లో అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ పర్వాలేదనిపించాడు. మొత్తం 14 మ్యాచ్‌లలో 158 స్ట్రైక్ రేట్ తో 413 పరుగులు చేశాడు. వాటిలో 3 అర్థ శతకాలు కూడా ఉన్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లలో నిలకడగా ఆడటమే కాకుండా.. షమీ, బుమ్రా లాంటి బౌలర్లను సైతం దడదడలాడించాడు.ఈ నేపథ్యంలో త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేయనున్నారనే వార్తలు వినిపించాయి. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో రాణించిన తర్వాత అతడిని టీ20 వరల్డ్ కప్ కు కూడా సెలక్ట్ చేస్తారంటూ చెప్పుకొచ్చారు. కానీ, అసలు సౌత్ ఆఫ్రికా టూర్ కే రాహుల్ త్రిపాఠికి అవకాశం దక్కలేదు. ఎంతో చక్కని ఆటతీరుతో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వస్తున్న రాహుల్ త్రిపాఠికి అదే నిరాశ మిగిలింది. సీజన్ మొత్తం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న వెంకటేశ్ అయ్యర్ కు కూడా అవకాశం ఇచ్చిన సెలక్టర్లు త్రిపాఠిని జట్టులోకి తీసుకోకపోవడాన్ని నెటిజన్స్ గట్టిగానే విమర్శిస్తున్నారు.
Disappointed to not see Rahul Tripathi’s name in the squad. He deserved a chance.
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 22, 2022
Rahul Tripathi should be in the Indian squad for SA T20i series.
— Aakash Chopra (@cricketaakash) May 17, 2022
మాథ్యూ వేడ్ లాంటి దిగ్గజ క్రికెటర్ సైతం రాహుల్ త్రిపాఠిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘రాహుల్ త్రిపాఠి ఎంతో నిలకడ గల ఆటగాడు. అతడు షార్ట్ పిచ్ బాల్స్ ను ఎంతో సమర్థంగా ఆడగలడు. అతడిని ఆస్ట్రేలియా(టీ20 వరల్డ్ కప్ కోసం)కు తీసుకెళ్లండి. అక్కడి బౌన్సీ పిచ్‌లపై అతను ఎంతో అద్భుతంగా రాణించగలడు’ అంటూ వేడ్ లాంటి దిగ్గజ క్రికెటర్ త్రిపాఠి టాలెంట్ గురించి చెబుతున్నా.. మన సెలక్టర్లకు మాత్రం రాహుల్ త్రిపాఠి అసలు కంట్లో పడటం లేదు.
Taking ruthuraj gaikwad, Ishan Kishan, Venkatesh Iyer but not Sanju Samson and Rahul tripathi?! What the hell is this!@BCCI @SGanguly99 https://t.co/gturKQ3W7e
— Prathisha #HallaBol (@prathi_17_18) May 22, 2022
ఇర్ఫాన్ పటాన్ లాంటి స్టార్ క్రికెటర్ కూడా రాహుల్ త్రిపాఠి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ‘రాహుల్ త్రిపాఠి ప్రతి ఐపీఎల్ సీజన్ కు వస్తాడు. తప్పకుండా చాలా సైలెంట్ గా తన పని పూర్తి చేసి వెళ్లిపోతాడు. ఎంతో టాలెంట్ ఉన్న అన్ క్యాప్డ్ ప్లేయర్ అతను’ అంటూ ఇర్ఫాన్ పటాన్ రాహుల్ త్రిపాఠిని ప్రశంసించడం చూశాం. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్లో రాహుల్ త్రిపాఠి మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీకి విశ్రాంతి ఇస్తున్న నేపథ్యంలో అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం కల్పిస్తారని అంతా ఎదురుచూసి నిరాశ చెందారు.
If Rahul Tripathi doesn’t play for India, it’s our own loss.
— Aditya (@Adityakrsaha) May 17, 2022
ఇప్పటివరకు రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ కెరీర్ ఎలా సాగిందంటే.. 2017లో రైజింగ్ సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన త్రిపాఠి.. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ (2018, 2019), కోల్ కతా నైట్ రైడర్స్(2020, 2021) జట్లకు ఆడాడు. ప్రతి సీజన్ లోనూ అందివచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నాడు. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ లో 17 మ్యాచుల్లో 397 పరుగులు చేశాడు త్రిపాఠి. ఇక ఈ సీజన్ కు ముందు మెగావేలంలో రూ. 8.5 కోట్లకు త్రిపాఠిని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచుల్లో 143 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠికి అన్యాయం జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RahulTripathi is not selected for India T20i series against South Africa 💔💔💔 pic.twitter.com/qY2mkvszwj
— Fukkard (@Fukkard) May 22, 2022
Where is Rahul Tripathi? https://t.co/1EdjF1X6pV
— Sushant Mehta (@SushantNMehta) May 22, 2022