ఆసియా కప్ 2022 సమరానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగష్టు 27న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలం పోరుతో టోర్నీ ప్రారంభం కానుండగా, ఆ మరుసటి రోజే దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ తలపడున్నాయి. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో.. ఇప్పటికే, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లన్నీ యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో దీపక్ చాహార్.. టోర్నీకి దూరమైనట్లు తెలుస్తోంది. అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ అతగాడికి అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్, ఐర్లాండ్ సిరీస్, ఇంగ్లాండ్ టూర్, వెస్టిండీస్ సిరీస్.. ఇలా అన్నింటికీ దూరమయ్యాడు. దాదాపు ఆరు నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. మొదటి వన్డేలో 3 వికెట్లు తీసి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన చాహార్.. రెండో వన్డేలో బరిలోకి దిగలేదు. మరలా మూడో వన్డేలో ఆడాడు. ఈ సిరీస్ లో బాగా రాణించిన చాహర్, బుమ్రా స్థానాన్ని రీప్లేస్ చేస్తాడనుకుంటుండగా, మరోసారి గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. చాహార్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కుల్దీప్ సేన్‌కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Kuldeep Sen has been named to the Asia Cup squad in place of the injured Deepak Chahar. He will be as Standby Player. (Dainik Bhaskar reported)
— CricBails (@cricbailsIN) August 25, 2022
కాగా, ఇప్పటికే.. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. మహమ్మద్ షమీ ఉన్నా అతన్ని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ ఒక్కడే టీమిండియాకు సీనియర్ ఫాస్ట్ బౌలర్. యువ ఆటగాళ్లు ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నా ఐదుకు మించి అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు. ఈ క్రమంలో దీపక్ చాహర్ దూరమయ్యాడనే వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.