మరో మూడు రోజుల్లో ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆగష్టు 27న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య పోరుతో టోర్నీ మొదలుకానుండగా, ఆ మరుసటి రోజే దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ తలపడున్నాయి. ఈ క్రమంలో కప్పు ఎవరు సాధిస్తారనే విషయంపై క్రీడాభిమానుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే.. పలువురు మాజీ ఆటగాళ్లు ఈ విషయంపై నోరు విప్పారు. తాజాగా, ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వాట్సన్ కూడా చేరారు. ఆరు జట్లు పాల్గొనబోయే ఈ టోర్నీలో అన్ని జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ఎప్పటిలానే టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే, ఈసారి కప్ కొట్టి భారత్ జట్టుపై.. పైచేయి సాధించాలని పాకిస్తాన్ దృఢ నిశ్చయంతో ఉంది. మరోవైపు.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా చాంపియన్స్ గా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వాట్సన్.. టైటిల్ కొట్టే జట్టేదే చెప్పుకొచ్చాడు. "భారత్, పాకిస్తాన్.. రెండు జట్లలోనే ఒకటి ఆసియా కప్ విజేతగా నిలుస్తుందని చెప్పిన వాట్సన్, ఆగస్టు 28న జరగబోయే.. భారత్, పాకిస్తాన్ పోరులో గెలిచిన జట్టుదే ట్రోఫీ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్ కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగుతోందని తెలిపాడు. వారిని అడ్డుకోవడం భారత్ కు చాలా కష్టమని పేర్కొన్నాడు. అయితే.. భారత్ కూడా గతేడాది టీ20 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇక, శనివారం ప్రారంభమయ్యే ఆసియా కప్ టోర్నీలోకి.. గ్యాప్ తీసుకున్న భారత స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులోకి పునరాగమనం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్.. పోరులో ఎవరు గెలుస్తారో.. మీ అభిప్రాయాలను కామెట్ల రూపంలో తెలియజేయండి. Shane Watson predicts India to win the Asia Cup 2022. pic.twitter.com/GNOlytsckC — Govardhan Reddy (@gova3555) August 24, 2022 ఇదీ చదవండి: IND vs PAK: ‘రోహిత్, కోహ్లీ కాదు.. అతనితో జాగ్రత్త’ పాకిస్తాన్ జట్టుకు వసీం అక్రమ్ హెచ్చరికలు! ఇదీ చదవండి: India vs Pakistan in Asia Cup: ఆసియా కప్ టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచుల లెక్కలు ఇవే!