గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ తొలి రోజే సంచలనాలు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను నమిబియా చిత్తుచిత్తుగా ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక నెథర్లాండ్స్-యూఏఈ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడు బరిలోకి దిగాడు. ఇంకా సరిగా మూతిమీద మీసాలు కూడా మోలవని పిల్లబచ్చాడగాడు.. వరల్డ్ కప్ బరిలోకి దిగి అతి తక్కువ వయసులో వరల్డ్ కప్ ఆడుతున్న రికార్డుతో చరిత్ర సృష్టించాడు.
యూఏఈ తరఫున నెథర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన 16 ఏళ్ల అయాన్ అఫ్జల్ ఖాన్ టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 2005 నవంబర్ 15న జన్మించిన అయాన్ ఖాన్.. ఆల్‌రౌండర్‌గా యూఏఈ వరల్డ్ కప్ టీమ్‌లో చోటు సంపాదించడమే కాకుండా.. తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగాడు. అయాన్ రైట్‌ఆర్మ్ బ్యాటర్. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్ కూడా. విశేషం ఏమిటంటే.. అయాన్ ఖాన్ ఇప్పటి వరకు కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ.. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చారు. మూడు ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లు ఆడిన అయాన్ 25 రన్స్ చేసి, మూడు వికెట్లు పడగొట్టాడు. అయాన్ ఖాన్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
ఈ ఏడాది సెప్టెంబర్ 25న బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదిక జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ఇంత చిన్న వయసులోనే అయాన్ ఖాన్ టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో పాల్గొనటంపై స్పందిస్తూ.. తనకు టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉన్నా.. పెద్ద టోర్నీ అనే ఒత్తిడి ఏం లేదని అంటున్నాడు. కాగా.. 16 ఏళ్ల కుర్రాడు టీ20 వరల్డ్ కప్ ఆడుతుంటంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పది పాసై ఏడాది కానట్టు ఉంది అప్పుడు టీ20 వరల్డ్ కప్ ఆడేస్తున్నాడు టాలెంటెడ్ కుర్రాడు అంటూ అభినందిస్తున్నారు.
Aayan Afzal Khan will become the youngest player to feature in a #T20WorldCup if he is picked to face Netherlands tomorrow
He will also become the first player to be born after the 2005 Ashes to play in a T20 World Cup … 🤯https://t.co/LWEdJvwdKA
— Paul Radley (@PaulRadley) October 15, 2022