ఏ రంగంలోనైనా గొప్ప స్థాయికి వెళ్లాలంటే ఎంతో శ్రమించాలి. నంబర్ వన్ స్థాయికి వెళ్లిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే. ఆయా రంగాల్లో కొంతమంది అత్యున్నత స్థాయికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. కొందరు మాత్రమే నంబర్ వన్ స్థానంలో స్థిరంగా కొన్నేళ్లపాటు అలా ఉండిపోతారు. దాని వెనుక వారి నిరంతర కృషి, పట్టుదల ఉంటుంది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీని చూస్తే నిజమనిపిస్తుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన కోహ్లీ.. తన కెరీర్‌లో ఎన్నో గొప్పగొప్ప రికార్డులు సాధించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఇండియన్ క్రికెట్‌ను ఒంటిచేత్తో ఏలాడు. అయినా కూడా ఇంకా అతనిలోని డెడికేషన్, ఆటపై మక్కువ, శ్రమ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు.
ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా.. ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దాని కంటే ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఒక్కో వార్మప్ మ్యాచ్ కూడా ఉంది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలవాలంటే విరాట్ కోహ్లీ రాణించి తీరాలి. అందుకే తన స్థాయి, సామర్థ్యంతో పాటు జట్టుకు తన అవసరం ఎంతుందో అందరికంటే బాగా తెలిసిన కోహ్లీ.. అందుకు తగ్గట్లే నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. ఎంతలా అంటే.. ఇక చాలు స్వామి నువ్వు రూమ్‌కి వెళ్లు ఇంకో బ్యాటర్‌తో ప్రాక్టీస్ చేయించాలి అని కోచింగ్ స్టాఫ్ మొత్తుకుంటున్నా.. తర్వాత ప్రాక్టీస్ చేయాల్సిన బ్యాటర్ వచ్చేంత వరకు నేను ప్రాక్టీస్ చేస్తా.. అతను రాగానే వెళ్తా అంటూ ఆటపై తన డెడికేషన్ ఏంటో చూపించాడు.
శనివారం టీమిండియా ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా.. విరాట్ కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి నెట్ బౌలర్స్‌తో బ్యాటింగ్ కోచ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఒక్కో బ్యాటర్‌కు కొంత సమయం ఇస్తూ.. పాక్టీస్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో గంటల కొద్ది ప్రాక్టీస్ చేసిన కోహ్లీ టైమ్ ముగిసింది. ఆ విషయాన్ని కోచింగ్ స్టాఫ్ సైతం గుర్తు చేస్తూ.. మరీ ‘విరాట్.. యువర్ టైమ్ ఇజ్ అప్’ అంటూ నెట్స్ వదిలి వెళ్లాలని సూచించారు. కానీ.. తన తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన దీపక్ హుడా ఇంకా అక్కడికి రాకపోవడంతో.. అతను వచ్చేంత వరకు నేను ప్రాక్టీస్ చేస్తా.. అతను రాగానే నేను వెళ్లిపోతానని పర్మిషన్ తీసుకుని మరీ ప్రాక్టీస్ చేశాడు. ఇప్పటికే కెరీర్‌లో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లి కోహ్లీ.. లాంటి ఆటగాడికి ఒక యువ ప్లేయర్ చేసినంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరంలేదు. పైగా ఆస్ట్రేలియా పిచ్‌లపై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అయినా కూడా.. కోహ్లీ నెట్స్‌లో చెమటలు చిందించారు. అది ఒక ఛాంపియన్ ప్లేయర్‌కు ఉండే లక్షణం అని క్రికెట్ అభిమానలు ఆ వీడియోను షేర్ చేస్తూ కోహ్లీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Another video of Kohli practicing at the WACA. What makes him so great is he just alters one of two aspects to improve his game. #Kohli #T20WorldCup #CricketTwitter pic.twitter.com/V45oWCpBiT
— Gav Joshi (@Gampa_cricket) October 13, 2022