టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 45వ రోజుకి చేరుకుంది. 45వ రోజు పాదయాత్ర తంబాళ్లపల్లె నియోజకవర్గంలోని కమ్మపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 45వ రోజుకి చేరుకుంది. 45వ రోజు పాదయాత్ర తంబాళ్లపల్లె నియోజకవర్గంలోని కమ్మపల్లి ( పులికల్లు పంచాయతీ ) విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. కమ్మలపల్లి వద్ద యువతీ, యువకులతో లోకేష్ ముఖాముఖీ నిర్వహించారు. అలానే ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక, పాదయాత్ర 45వ రోజుకు చేరుకుంది. 45వ రోజు పాదయాత్ర కమ్మలపల్లి విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ సెల్ఫీల కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను చూడటానికి వచ్చిన 1000 మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సెల్ఫీలు దిగారు. లోకేష్ తమతో ఎంతో ప్రేమతో సెల్ఫీలు దిగటంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాదయాత్ర కొనసాగించిన లోకేశ్.. మధ్యాహ్నం 3 గంటలకు మొలకలచెరువు బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రభుత్వపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేటితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు యువగళం యాత్ర సాగింది.
ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ప్రజలతో మమేకవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ.. 550 కిలోమీటర్లకు పైగా లోకేశ్ పాదయాత్ర చేశారు. శుక్రవారం సాయంత్రం లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలం చీకటి మానుపల్లికి లోకేశ్ చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలలో దాదాపు నాలుగు రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు అవసమైన ఏర్పాట్లను టీడీపీ శ్రేణులు ఇప్పటికే పూర్తి చేశాయి. మరి.. లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.