టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజుకి చేరుకుంది. 107వ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజుకి చేరుకుంది. 107వ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గం కొనసాగింది. నేడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు విడిది కేంద్రం నుంచి యువగళ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈరోజు కూడా విడిది కేంద్రంలో 1000 మందికిపై అభిమానులకు లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. దొర్నిపాడు విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. తన కోసం వచ్చిన వారితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. అలానే ప్రస్తుతం కొనసాగుతున్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా భారీ స్పందన వస్తుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది.
దొర్నిపాడు క్యాంప్ సైట్ వద్ద బలిజ సామాజికవర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. వారు తమ సమస్యలను లోకేశ్ కు విన్నవించుకున్నారు. అలానే వారికి ఎంతో ఓపికగా లోకేశ్ సమాధానం చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బలిజ సామాజిక వర్గాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటున్నానని ఆయన హామి ఇచ్చారు. అలా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో లోకేశ్ విరుచపడ్డారు. ఇక తన పాదయాత్రలో వివిధ గ్రామాల ప్రజలతో మమేకమవుతు ముందుకు వెళ్లారు. మరి..107వ రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.