'ప్రేమ' అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అంతేకాక ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. తాజాగా చిత్తూరు అబ్బాయితో చైనా అమ్మాయి ప్రేమలో పడింది. ఎన్నో పోరాటలు చేసి.. చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
‘ప్రేమ’ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అంతేకాక ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలానే తమకు సంబంధంలేని వారిని సైతం ప్రేమించి ఎందరో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరి ప్రేమలు అయితే ఖండాతారాలు దాటి మరి వెళ్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా నగరికి చెందిన యువకుడు.. చైనాకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిత్తూరు జిల్లా నగరికి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటకు చెందిన వీఎన్ కృష్ణన్, లత దంపతుల కుమారుడు వీకే పురుషోత్తమన్ కృష్ణన్ బీఈ కంప్యూటర్ సైన్స్ చదివాడు. అనంతరం చైనాలోని బెల్జింగ్ లో బీఎమ్ డబ్ల్యూ గ్రూప్ ఆసియా లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక అదే ప్రాంతంలో వాంగ్ డిసెంగ్, యాంగ్ కనియింగ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి డబ్ల్యూ. మింగ్ మింగ్ అనే కుమార్తె ఉంది. ఆమె పురుషోత్తమన్ పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తోంది.
ఆమె ఫైనాన్షియల్ విభాగంలో విధులు నిర్వహిస్తోంది. సదరు యువతితో కృష్ణన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా చాలా కాలం తరువాత ప్రేమగా మారింది. తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని ఇరువురు భావించారు. అంతే ఇరువురు.. తమ ప్రేమ విషయాన్ని కుటుంబాల్లో తెలియజేశారు. తొలుత వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయిన.. చివరికి ఈ యువ జంట చెప్పిన మాటలకు ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించారు. అలానే ఇరు సంప్రదాయ, వ్యవహారాలనే అడ్డు గోడలను తొలగించుకుని ఇరువురు విజయం సాధించారు.
కృష్ణన్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు నగరిలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆ యువ జంట వివాహం జరపడానికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో చైనా నుంచి నగరికి వచ్చిన వధువుకు వరుని తరఫు వారు హిందూ సంప్రదాయం ప్రకారం నలుగు పెట్టి, చీరకట్టి అందంగా ముస్తాబు చేశారు. ఇక ఇంటి నుంచి తీసుకెళ్లి స్థానిక ఏజేఎస్ కల్యాణ మండపంలో వీరి వివాహం జరిపించారు. అలా దేశ సరిహద్దులు దాటి మరి.. ఈ యువ జంట ఒక్కటయ్యారు. మరి.. ఈ జంట ప్రేమ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.