తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి భద్రతను పెంచారు. రెండు రోజులుగా కుప్పంలో సాగుతున్న పర్యటనలో జరిగిన ఘటనల దృష్ట్యా భద్రతను పెంచారు. ఈ మేరకు చంద్రబాబు భద్రత బృందంలోని ఎన్ఎస్జీ కమాండోల సంఖ్యను పెంచారు. 6+6 గా ఉన్న ఎన్ ఎస్ జీ భద్రతను 12+12 కు పెంచారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇప్పుడు డీఐజీ ర్యాంక్ అధికారితో చంద్రబాబుకు భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.చంద్రబాబుకు భద్రతను పెంచుతూ ఎన్ఎస్‌జీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని, అమరావతిలోని పార్టీ కార్యాలయాన్ని ఎన్ఎస్‌జీ డీజీ నిన్ననే పరిశీలించారు. .
ఇటీవల కుప్పంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతను పెంచారు. కుప్పంలో మూడో రోజు పర్యటన సందర్భంగా చంద్రబాబు మోడల్ కాలనీ సందర్శించినున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల నుంచి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగ్గరు. ఇరుపార్టీల ఫ్లెక్సీలను చించేశారు. అన్న క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అలా టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇలా కుప్పంలో చోటుచేసుకున్న పరిణామాలతో ప్రభుత్వం చంద్రబాబుకు భద్రతను పెంచింది. మరి.. చంద్రబాబు భద్రత పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.