టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సాధించి తెచ్చుకున్న తెలంగాణపై భయపెట్టి పరిపాలనను సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించాల్సిన సీఎం ఇదేం నిరంకుశత్వం అంటూ ఫైర్ అయ్యారు.
గతంలో రాజకీయ నాయకుల పరిపాలన వ్యవస్థలో లోపాలు సంభవించినప్పుడు నక్సలైట్లు భయపెట్టేవారని ఇప్పుడు కూడా నక్సలైట్ లు ఉండే బాగుండేదంటూ బాంబ్ పేల్చారు. కనీసం వాళ్లను చూసైన నాయకులు భయపడి పరిపాలన సాగించేవాళ్లని ఎందుకు లేరా అని ఇప్పుడు అనిపిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.