నటుడిగా, రైటర్ గా, డైరెక్టర్ గా, మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కి, బాబుకి చాలా తేడా ఉందని అన్నారు.
టాలీవుడ్ లో నటుడిగా, రచయితగా, డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే పోసాని తనదైన హాస్యంతో కూడా నవ్విస్తున్నారు. అయితే సినిమాల్లో బిజీగా ఉంటూనే రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేస్తూ.. వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇటీవలే వైసీపీ ప్రభుత్వం పోసానికి.. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీ తనకు అన్నీ ఇచ్చిందని.. ఇప్పుడు దానికి జగన్ అదనంగా మరొక పదవి ఇచ్చారని, అదనంగా మరొక బరువు పెట్టారని అన్నారు. తాను ఎవరితో అయినా పోరాడగలను, ధైర్యంగా మాట్లాడగలను అని అన్నారు. మంచి, మంచి అంటున్నాను, చెడు అయిపోద్దా? ఇది జరిగింది, ఇది హిస్టరీ, ఇది ఇమాజినేషన్ కాదని అన్నారు. జగన్ ఒక పద్ధతి పాటించారని, చంద్రబాబు ఆ పద్దతిని పాటించలేదని అన్నారు. చరిత్రలో ఎంతోమంది రాజులు తండ్రులను, అన్నదమ్ములను వెన్నుపోటు పొడవడం, రాజకీయాల్లోకి అధికారంలోకి రావడం కోసం నేతలు చేసిన కుట్రలు ఉంటాయని జర్నలిస్ట్ అడగ్గా.. పోసాని సమాధానమిచ్చారు. జగన్ ఆ లెవల్ లో వచ్చాడు. ఈయన చంద్రబాబులా పార్టీలు మారుకుంటూ రాలేదు అని అన్నారు.
వెన్నుపోటు విషయంలో చంద్రబాబుకి ఆయన బతికున్నన్నాళ్లే కాదు, చచ్చినా కూడా ఉంటుందని అన్నారు. రాజకీయం అంటే ప్రజా సేవ అని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు వస్తాయని అన్నారు. జగన్ నమ్ముకున్నది ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ని కాబట్టి 175 స్థానాలు వస్తాయని అన్నారు. ప్రతిపక్షాల వాళ్ళు ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నప్పుడు దీన్ని ఎలా వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది అని అడగ్గా.. వీళ్ళు ఎవరూ అడ్డుకోనక్కర్లేదు, ప్రజల మనస్సుల్లో జగన్ ఉన్నంతకాలం ఎవరు ఏం వాగినా, ఎవరేం నాకినా, ఎవరేం చేసినా ఏమీ కాదని అన్నారు. మరి పోసాని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.