మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలకమైన అంశాలపై స్పందించారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమైనప్పటికీ ఒక లైన్ అనేది ఉంటుందని దాన్ని దాటోద్దని పవన్ హితవుపలికారు. హద్దు మీరి అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలకు ఎలా ఎదుర్కొవాలో.. ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసని అన్నారు. మీరు ఎంత దారుణంగా హద్దు మీరి ప్రవర్తించినా చూస్తూ ఊరుకుంటారని అనుకోవద్దని, నేను లైన్ దాటితే వైసీపీ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు. ఒక బాధ్యతగా రాజకీయాలను తీసుకుని ప్రజల కోసం పని చేస్తున్నామని తమను తక్కువగా అంచనా వెయొద్దని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి కులం చాటున దాక్కొవద్దని అన్నారు.