Koulu Raithula Bharosa Yatra: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ కౌలు రైతుల భరోసా యాత్ర’ ప్రారంభించారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకె రామకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సాకె రామకృష్ణ భార్యకు లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం అందలేదని అన్నారు.
తమను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున కుటుంబానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. ఈరోజు ధర్మవరం మండలంలోని గొట్లూరు, అనంతరపురం రూరల్ మండలంలోని పూలకుంట, మన్నీల గ్రామాలలో ఆయన పర్యటన సాగనుంది. కాగా, కౌలు రైతులను ఆదుకోవటం కోసం తన వంతుగా పవన్ కల్యాణ్ 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అలనాటి హీరోయిన్లతో సీఎం స్టాలిన్.. ఫోటో వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.