టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 53వ రోజుకి చేరుకుంది. 53వ రోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోని రెడ్డి చెరువు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 53వ రోజుకి చేరుకుంది. 53వ రోజు పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గుమ్మయ్యగారిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి లోకేశ్ సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి.. వారికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. గుమ్మయ్యగారిపల్లిలో తనను కలవడానికి వచ్చిన యువతీ, యువకులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. విడిది కేంద్రంలో తనను కలవడానికి వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేశ్ ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ యువగళం పాదయాత్ర నేటితో 53వ రోజుకు చేరుకుంది. 53వ రోజు పాదయాత్ర గోరంట్ల మండలం గుమ్మయ్యాగారి పల్లి విడిది కేంద్రం నుంచి 9 గంటలకు ప్రారంభం అయింది.
బాలన్నగారిపల్లి క్రాస్ వద్దకు చేరుకున్న లోకేశ్.. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మల్లాపల్లిలో ఇటుకల తయారీ కార్మికులతో భేటీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటుకల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. ఇటుకల తయారీకి అవసరమైన గ్రామీణ చెరువుల్లో మట్టి తోలుకోవడానికి, కట్టెలు కొట్టుకోవడానికి ఉచితంగా అనుమతులు ఇస్తామని లోకేష్ వెల్లడించారు.
ఆ తరువాత పాలసముద్రం కూడలి వద్ద లోకేశ్ బీసీ నేతలతో సమావేశమయ్యారు. మిషన్ తండా వద్ద గిరిజనులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సోమందేపల్లి మండలం గుడిపల్లిలో స్థానికులతో లోకేశ్ కాసేపు ముచ్చటించారు. ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ నిప్పులు చేరిగారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తామో లోకేశ్ వివరించారు. మరి.. 53 రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.