ఓ సర్వే పేరిటి సంచనల రిపోర్ట్ తయారు చేశానని తెలిపారు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీ పార్టీ కేవలం 50 స్థానాలు మాత్రమె గెలుచుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే కొందరు సర్వేలు చేశారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుందనే రిపోర్ట్ నా దగ్గర ఉందని తెలిపారు. ఇక నాపై కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో అసత్య ప్రచారం చేయిస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని అన్నారు. నేను అసలు పార్లమెంట్‌కే వెళ్లట్లేదని అంటున్నారని తెలిపారు.
నాపై కొందరు ప్రచారం చేస్తున్నారని, నా రికార్డ్ ఏంటో జాతీయ మీడియాలే చెబుతున్నాయని తెలిపారు. ఇక దీంతో పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి అనుమానాలు నాకే కాదని, ప్రజలందరికీ కల్గుతున్నాయని అన్నారు. చనిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గుండెపోటని ఎలా చెబుతారంటూ రఘురామ ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ అవసరం లేదని, ఓ సాధారణ కానిస్టేుబుల్ చాలని అన్నారు రఘురామ.