సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వైసీపీలో చేరతారా? సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నిజాయితీగా, నిస్వార్థంగా పని చేసిన లక్ష్మీ నారాయణ.. ప్రజా సేవ చేయాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ప్రజలు ఆయనలోని ప్రజా నాయకుడిని గుర్తించలేకపోయారు. అయితే మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరతారని, టీడీపీలో చేరతారని రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు వైసీపీలో చేరతారా? అనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు.
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ప్రజా సేవ చేయాలని ఎన్నో కలలు కన్నారు. అందుకోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అజెండాగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2019లో జనసేన పార్టీలో చేరారు. 2019 జనరల్ ఎలక్షన్స్ లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నారు. అయితే ఆయన గురించి డైలీ సోషల్ మీడియాలో ఏదో ఒక ప్రచారం జరుగుతుంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిందని.. వైసీపీ వాళ్ళు పిలిచారని ప్రచారం జరుగుతుంటుంది. అయితే ఈ వార్తలపై ఆయన స్పష్టత ఇచ్చారు. వైసీపీలో చేరనున్నారా అన్న ప్రశ్నకు.. ఆయన ఖచ్చితమైన సమాధానాన్ని ఇచ్చారు.
తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పోలీస్ గా ఉంటే ఎవరో ఒక రాజకీయ నాయకుడు తనను శాసిస్తా ఉంటాడని.. అందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అయితే జనం తనకు ఓటు వేయలేదని.. కానీ నిరాశకే నిరాశ పుట్టేలా ప్రయత్నిస్తూనే ఉంటానని అన్నారు. నిచ్చెనను శుభ్రం చేయాలనుకుంటే పై నుంచి శుభ్రం చేసుకుంటూ రావాలని.. అలానే రాజకీయాలను శుభ్రం చేయాలంటే టాప్ లెవల్ నుంచి శుభ్రం చేసుకుంటూ రావాలని అన్నారు. పార్టీ పెట్టమని తనకు చాలా మంది సూచించారని.. కానీ పార్టీని నడపాలంటే చాలా డబ్బు కావాల్సి ఉంటుందని.. అందుకే పెట్టలేదని అన్నారు. తనను గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం అవ్వనిచ్చేవాడ్ని కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు.
జనాలు ఆదరించకపోయినా ప్రయత్నాలు చేసుకుంటూ పోతా అని అన్నారు. ఫలితాలు అవే వస్తాయని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు చేసుకుంటూ పోవడమే అని అన్నారు. రోజుకు మూడు పార్టీల్లో చేరతానని, సోషల్ మీడియాలో తనను అనేక పార్టీలు మారుస్తూ ఉంటారని చమత్కరించారు. ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ అంటారు, మధ్యాహ్నం వైసీపీ అంటారు, సాయంత్రం బీఆర్ఎస్ అంటారు, తర్వాత టీడీపీ అంటారని అన్నారు. అయితే బీఆర్ఎస్ తో పాటు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా తనను పార్టీలో చేరమని అడిగారని, అయితే వైసీపీలోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నానని అన్నారు. మరి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వైసీపీలోకి వెళ్తారా? వైసీపీలోకి వెళ్తే బాగుంటుందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.